నెల‌కొక‌టి.. ఇదీ అంజ‌లి లెక్క‌

  • IndiaGlitz, [Friday,October 23 2015]

సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు', 'బ‌లుపు', 'గీతాంజ‌లి'.. ఇలా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది తెలుగమ్మాయి అంజ‌లి. మ‌ధ్య‌లో చేసిన 'మ‌సాలా'ని మిన‌హాయిస్తే.. సెకండ్ ఇన్నింగ్స్‌లో అంజ‌లి హ‌వా బాగానే సాగుతున్న‌ట్లే. అందుకే ప్ర‌స్తుతం ఈ బ‌బ్లీ గ‌ర్ల్ చేతిలో మూడు సినిమాలున్నాయి. 'శంక‌రాభ‌ర‌ణం', 'చిత్రాంగ‌ద‌', 'డిక్టేట‌ర్' చిత్రాలే ఆ మూడు సినిమాలు. ఈ మూడు సినిమాలు కూడా నెల‌కొక‌టి చొప్పున ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.

నిఖిల్‌, నందిత జంట‌గా న‌టించిన 'శంక‌రాభ‌ర‌ణం'లో అంజ‌లిది ఓ కీల‌క పాత్ర‌. ఈ సినిమా న‌వంబ‌ర్‌లో దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల కానుంది. ఇక హీరోయిన్ సెంట్రిక్ చిత్ర‌మైన 'చిత్రాంగ‌ద' డిసెంబ‌ర్‌లో ఆడియ‌న్స్ ముందుకు రానుంది. ఈ ఫిల్మ్‌లో అంజ‌లి ఇప్ప‌టివ‌ర‌కు ఎప్పుడూ చేయ‌ని విభిన్న‌మైన పాత్ర‌ని చేస్తోంది. ఇక నంద‌మూరి బాల‌కృష్ణ‌తో తొలిసారిగా జోడి క‌డుతున్న 'డిక్టేట‌ర్' సినిమా ఏమో సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి ప్ర‌థ‌మార్థంలో సంద‌డి చేయ‌బోతోంది. అంటే.. న‌వంబ‌ర్ నుంచి జ‌న‌వ‌రి వ‌ర‌కు వ‌రుస‌గా త‌న సినిమాల‌తో అంజ‌లి ప‌ల‌క‌రించ‌నుంద‌న్న‌మాట‌.

More News

కొలంబస్ మూవీ రివ్యూ

దసరాకు విడుదలైన మూడు సినిమాల్లో యూత్ఫుల్ లవ్ జోనర్లో విడుదలైన సినిమా కొలంబస్. ప్రేమ కోసం వెతికే ఓ ప్రేమికుడి కథే కొలంబస్. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన తెచ్చుకుంది? సుమంత్ అశ్విన్ కు ఈ సినిమా ఎలాంటి సినిమా అవుతుంది? తెలుసుకోవాలంటే ఓ లుక్కేద్దాం.

వైట్ల‌, కోన మ‌ధ్య వార్

డైరెక్ట‌ర్ శ్రీను వైట్ల‌, రైట‌ర్ కోన వెంక‌ట్..వీరిద్ద‌రు క‌లసి చాలా సినిమాల‌కు వ‌ర్క్ చేసారు. బాద్ షా సినిమా త‌ర్వాత వీరిద్ద‌రికి అభిప్రాయాల్లో తేడా రావ‌డంతో క‌ల‌సి వ‌ర్క్ చేయ‌కూడ‌ద‌నుకున్నారు.

ర‌వితేజ ఎవ‌డో ఒక‌డు ప్రారంభం

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ఎవ‌డో ఒక‌డు.

కంచె మూవీ రివ్యూ

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తొలి చిత్రం ‘ముకుంద’ తర్వాత సెకండ్ మూవీని రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్ లో కాకుండా డిఫరెంట్ మూవీని చేయడానికి అడుగు వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది

రాజు గారి గది మూవీ రివ్యూ

చిన్న టీవీ యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి అంకితం, మాయాద్వీపం వంటి షోస్ చేసిన యాంకర్ ఓంకార్ ఆట డ్యాన్స్ షోతో తెలుగు ప్రజలకు చాలా చేరువయ్యారు. టీవీ రంగం నుండి వెండితెర దర్శకుడుగా పరిచయమై డైరెక్ట్ చేసిన ‘జీనియస్’ ప్లాపయ్యింది.