ఆ హీరోతో అంజలి ప్రేమలో పడింది..
- IndiaGlitz, [Friday,June 17 2016]
షాపింగ్ మాల్, జర్నీ, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి, డిక్టేటర్...తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులును ఆకట్టుకున్న అందాల కధానాయిక అంజలి. తెలుగులో అప్పుడప్పుడు నటిస్తున్నా తమిళ్ లో మాత్రం వరుసగా సినిమాలు చేస్తుంది. తాజాగా జర్నీ చిత్రంలో నటించిన హీరో జై తో కలిసి ఓ చిత్రం చేస్తుంది.
ఈ చిత్రాన్ని జులై 6న ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే...జర్నీ చిత్రం చేస్తున్నప్పుడు జై, అంజలి ఇద్దరు ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. ఆతర్వాత వారి లవ్ బ్రేక్ అప్ అయ్యింది అన్నారు. కానీ...వారి లవ్ బ్రేక్ అప్ కాలేదట. వీరిద్దరూ ఇంకా లవ్ లోనే ఉన్నారట. నిన్న అంజలి పుట్టినరోజు. ఈ సందర్భంగా జై అంజలికి బర్త్ డే విషెష్ తెలియచేయడం...అంజలి ఇది నా బెస్ట్ బర్త్ డే. ఎప్పుడూ నాతోనే ఉండు జై అంటూ ట్వీట్ చేయడంతో వీరిద్దరి లవ్ పై కన్ ఫ్యూజన్ పోయింది.. క్లారిటీ వచ్చేసింది..