Bahiskarana:అంజలి ప్రధాన పాత్రలో ‘బహిష్కరణ’.. మోషన్ పోస్టర్ రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
యాబైకి పైగా చిత్రాల్లో ఎన్నో హీరోయిన్గా, ప్రధాన పాత్రల్లో మెప్పించిన నటి అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో ZEE 5, ఫిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఆదివారం అంజలి పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘బహిష్కరణ’ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
మోషన్ పోస్టర్‌ను గమనిస్తే.. అంజలి చేతిలో వేట కొడవలి పట్టుకుని కోపంగా కూర్చుంది.. ఆమె పక్కన్న ఓ చెక్క కుర్చీ మంటల్లో కాలిపోతుంది. మరోసారి అంజలి మరో విలక్షణమైన పాత్రలో ఇన్టెన్స్ క్యారెక్టర్‌తో ‘బహిష్కరణ’ వెబ్ సిరీస్‌లో మెప్పించనుందని తెలుస్తోంది. అంజలి ప్రధాన పాత్రలో నటిస్తోన్నఈ సిరీస్‌లో రవీంద్ర విజయ్, శ్రీతేజ్, అనన్య నాగళ్ల, షణ్ముక్, చైతన్య సాగిరాజు, మహ్మద్ బాషా, బేబీ చైత్ర ఇతర పాత్రల్లో మెప్పించనున్నారు.
ఫిక్సల్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రశాంతి మలిశెట్టి నిర్మిస్తోన్న ‘బహిష్కరణ’ సిరీస్ త్వరలోనే ZEE 5 ద్వారా ప్రేక్షకులను మెప్పించనుంది. ఈ సిరీస్‌కు ప్రసన్నకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సిద్ధార్థ్ సదాశివుని సంగీతాన్ని సమకూరుస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
భారతదేశంలో అతి పెద్ద ఓటీటీ మాధ్యమం ZEE 5. పలు భాషల్లో వైవిధ్యమైన సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులకు అపరిమితమైన వినోదాన్ని ఇది అందిస్తోంది. ఇదే క్రమంలో ‘బహిష్కరణ’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియెన్స్‌ను త్వరలోనే అలరించనుంది.
ZEE5 గురించి...
జీ5 భారతదేశపు యంగస్ట్ ఓటీటీ ప్లాట్ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్లర్‌గా ప్రసిద్ధి పొందింది. మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. గ్లోబల్ కంటెంట్ పవర్ హౌస్ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్) నుంచి శాఖగా మొదలైంది జీ5. అత్యద్భుతమైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్రరీ ఉన్న ప్లాట్ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజినల్స్, 5 లక్షలకు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, మలయాళం, తెలుగు, తమిళ్, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజినల్స్, ఇంటర్నేషనల్ మూవీస్, టీవీ షోస్, మ్యూజిక్, కిడ్స్ షోస్, ఎడ్టెక్, సినీ ప్లేస్, న్యూస్, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్షకులను రంజింపజేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్పార్మ్ కావడంతో జీ5 12 భాషల్లో అత్యద్భుతమైన కంటెంట్‌ని ప్రేక్షకులకు అందించగలుగుతోంది.
నటీనటులు: అంజలి, రవీంద్ర విజయ్, శ్రీతేజ్, అనన్య నాగళ్ల, షణ్ముక్, చైతన్య సాగిరాజు, మహ్మద్ బాషా, బేబీ చైత్ర తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments