ఆ...హార్రర్ సీక్వెల్ లో అంజలి..
Send us your feedback to audioarticles@vaarta.com
ఆ..హార్రర్ మూవీ సీక్వెల్ లో అంజలి నటిస్తుందట. ఇంతకీ ఏ హార్రర్ మూవీ అనుకుంటున్నారా..? రాజు గారి గది. ఓంకార్ తెరకెక్కించిన రాజు గారి గది చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. అశ్విన్, థన్య బాలక్రిష్ణన్ జంటగా నటించిన రాజు గారి గది హార్రర్ తో పాటు మంచి సందేశం కూడా అందించింది. ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన స్పూర్తితో ఓంకార్ రాజు గారి గది సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రధాన
పాత్ర కోసం అంజలిని సంప్రదించారట. కథ విని అంజలి ఓకె చెప్పిందట. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. గీతాంజలి సినిమాతో ఆకట్టుకున్న అంజలి మళ్లీ మరో హార్రర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం అంజలి బాలయ్య సరసన డిక్టేటర్ మూవీలో నటించింది. శంకరాభరణంలో నటించిన ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయిన అంజలి డిక్టేటర్, రాజు గారి గది సీక్వెల్ తో సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments