ఫిబ్రవరి 10న విడుదలకు ముస్తాబవుతున్న చిత్రాంగద
Tuesday, January 24, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ కథానాయిక అంజలి టైటిల్ పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో ఓ క్రేజీ చిత్రం రూపొందుతోంది. తెలుగులో చిత్రాంగద పేరుతో.. తమిళంలో యార్నీ పేరుతో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి పిల్ల జమీందార్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించి, ప్రస్తుతం ప్రముఖ కథానాయిక అనుష్కతో భాగమతి వంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్న వెర్సటైల్ దర్శకుడు అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్ర ఆడియోను త్వరలో విడుదల చేసి చిత్రాన్ని ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ జానర్‌లో రూపొందుతున్న చిత్రమిది. సినిమా ఆద్యంతం ఉత్కంఠగా, ఆసక్తికరంగా వుంటుంది. చిత్రంలో వుండే ట్విస్ట్‌లు ఆడియన్స్‌కు షాక్ గురిచేస్తాయి.
అంజలి పాడిన పాట చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా అంజలియే ఈ పాట పాడింది.ఇప్పటి వరకు కథానాయిక అంజలిని తన కెరీర్‌లో చేయనటువంటి ఓ విభిన్నమైన పాత్రను చిత్రాంగదలో పోషిస్తుంది. టైటిల్ పాత్రలో ఆమె అభినయం చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. కొన్ని అదృశ్య శక్తుల కారణంగా ఆమె జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడింది? తనకు ఎదురైన సవాళ్లను అధిగించే క్రమంలో చిత్రాంగదకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నదే మా చిత్ర ఇతివృత్తం గీతాంజలి తర్వాత అంజలి నటిస్తున్న మరో లేడి ఓరియెంటెడ్ చిత్రమిది. మహిళా ప్రధాన కథాంశంతో రూపొందిస్తున్న ఈ హారర్, థ్రిల్లర్‌లో ప్రతి సన్నివేశం ఊహించని మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది.
కథానుగుణంగా ఆమెరికాలోని పలు అందమైన లొకేషన్స్ కీలక ఘట్టాల్ని చిత్రీకరించాం అన్నారు.జెపీ, సప్తగిరి, రాజారవీంద్ర, సిందుతులానీ,రక్ష, దీపక్, సాక్షిగులాటి, జబర్ధస్త్ సుధీర్, జ్యోతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సెల్వగణేష్, స్వామినాథన్, ఎడిటర్: ప్రవీణ్‌పూడి, కెమెరా:బాల్‌రెడ్డి (హైదరాబాద్) మరియు, జేమ్స్ క్వాన్, రోహిన్ (యూఎస్‌ఎ), సమర్పణ: టీసీఎస్ రెడ్డి, వెంకట్ వాడపల్లి, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: అశోక్.జి, నిర్మాతలు: గంగపట్నం శ్రీధర్, రెహమాన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments