అంజలి పని బాగుంది
Send us your feedback to audioarticles@vaarta.com
తొమ్మిదేళ్ల క్రితం తెలుగు హీరోయిన్గా రాణించేందుకు చాలానే కష్టపడింది తెలుగమ్మాయి అంజలి. అయితే.. అప్పుడు ఆమె ఆశించిన రీతిలో అవకాశాలు రాలేదు. దాంతో తమిళ పరిశ్రమకి చెక్కేసింది. అక్కడా బాగానే క్రేజ్ సంపాదించుకున్నాక.. మళ్లీ తెలుగులో ఆఫర్లతో పాటు ఎంతోకొంత క్రేజ్‌ని సంపాదించుకుంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'తో తొలి బ్రేక్ అందుకున్న అంజలికి.. ఆమె గత చిత్రం 'గీతాంజలి' ఊహించని విధంగా మంచి పేరు తీసుకువచ్చింది.
కట్‌చేస్తే.. అంజలి ఇంతకుముందెప్పుడూ లేని విధంగా మూడు సినిమాలతో బిజీ అయింది. నిఖిల్ సినిమా 'శంకరాభరణం'లో కథకి కీలకమైన బందిపోటుగానూ.. 'చిత్రాంగద' సినిమా కోసం టైటిల్ రోల్ లోనూ.. బాలకృష్ణ 'డిక్టేటర్' కోసం మెయిన్ హీరోయిన్‌గానూ అంజలి ఆ మధ్యంత బిజీ అయిపోయింది. వీటిలో శంకరాభరణం దీపావళికి రానుండగా.. డిక్టేటర్ సంక్రాంతికి రానుంది. ఇక చిత్రాంగద షూటింగ్ కూడా ఫినిషింగ్‌కి చేరుకుంది. వీటిలో ఏ రెండు సినిమాలు హిట్ అయినా.. అంజలి రేంజ్ పెరగడం ఖాయమంటున్నారు సినీ పండితులు. మొత్తానికి అంజలి పని బావుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com