Bahishkarana:అంజలి ప్రధాన పాత్రలో 'బహిష్కరణ' జూలై 19న ZEE 5

  • IndiaGlitz, [Thursday,July 04 2024]

యాబైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన నటి అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో ZEE 5, పిక్సెల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో మీడియాతో ‘బహిష్కరణ’ యూనిట్ ముచ్చటించింది. హీరోయిన్ అంజలి, దర్శక, నిర్మాతలు చెప్పిన విశేషాలివే..

పిక్సెల్ పిక్చర్స్ ప్రై. లి. అధినేత, నిర్మాత ప్రశాంతి మలిశెట్టి.. ‘జీ5తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. జీ5తో మాకు లోకల్ కథలను గ్లోబల్ వైడ్‌గా చెప్పగలమనే నమ్మకం ఏర్పడింది. అంజలి ఇది వరకెన్నడూ చేయనటువంటి, పోషించనటువంటి పాత్రలో కనిపిస్తారు.మా దర్శకుడు ముఖేష్ ప్రజాపతి, అసాధారణమైన కథతో, ఎంతో లోతైన ఎమోషన్స్‌తో మరెంతో ఉద్వేగభరితమైన వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. పిక్సెల్ పిక్చర్స్‌లో కంటెంట్ కింగ్.. కాంటెక్స్ట్ గాడ్ అని నమ్ముతాం. మన సమాజంలోని వాస్తవికతలను, పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ సిరీస్ ఉండనుంది. ZEE5 వంటి జాతీయ ప్లాట్‌ఫాంలలో ప్రాంతీయ కంటెంట్‌లకు ప్రాధాన్యత పెరిగింది. మా సిరీస్‌ దేశ వ్యాప్తంగా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నామ’ అని అన్నారు.

అంజలి మాట్లాడుతూ.. ‘పుష్ప పాత్ర పోషించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పటికీ నేను నమ్మలేకపోతోన్నాను. కానీ ఈ పాత్రను చేయడంతో నాకు సంతృప్తి కలిగింది. ఒక అమాయకపు వేశ్య నుంచి.. అన్ని అసమానతలను ఎదుర్కొనేందుకు శక్తి, ధైర్యాన్ని కూడగట్టుకునే స్త్రీ ప్రయాణం ఇందులో అద్భుతంగా ఉంటుంది. పుష్ప అంటే ఓ మిస్టరీ. ZEE5 ప్రేక్షకులు ఆమె చేసిన ప్రయాణం, ఆమెలో వచ్చిన మార్పుని చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు ముఖేష్ ప్రజాపతి మాట్లాడుతూ.. ‘బహిష్కరణలో అద్భుతమైన, శక్తివంతమైన కథ, కథనాలున్నాయి. అందులోని ప్రతీ పాత్ర, ఆ ఎమోషన్స్ ఎంతో సంక్లిష్టంగా, లోతుగా ఉంటాయి. పుష్ప పాత్ర.. కోల్పోవడానికి ఏమీ లేని, జీవితమంటేనే ఇంత అన్యాయంగా ఉంటుందని భావింస్తుంటుంది. అయితే అలా సముద్రంలా ప్రశాంతంగా ఉండే వ్యక్తి జోలికి పోతే వినాశనం ఎలా ఎదురువుతుందో చూపించాం. పుష్ప పాత్రలో అనేక లేయర్స్ ఉంటాయి.. ఎన్ని కష్టాలు వచ్చినా, ఏం జరిగినా కూడా ధైర్యంగా అడుగు ముందుకు వేసి ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది. అంజలి తన అసాధారణమైన నటనతో పుష్ప పాత్రకు ప్రాణం పోశారు. ZEE5, Pixel Picturesతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. నటీనటులంతా కూడా అంకితభావంతో పని చేశారు. ఆర్టిస్టులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దేశ వ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్‌ను బహిష్కరణ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నామ’ అని అన్నారు.

నటీనటులు: అంజలి, రవీంద్ర విజయ్, శ్రీతేజ్, అనన్య నాగళ్ల, షణ్ముక్, చైతన్య సాగిరాజు, మహ్మద్ బాషా, బేబీ చైత్ర తదితరులు

More News

Rautu Ka Raaz:న‌వాజుద్దీన్ సిద్ధిఖీ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో ‘రౌతు కా రాజ్’ZEE5లో ఆస‌క్తిని రేకెత్తిస్తోన్న మ‌ర్డ‌ర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్

ఇండియాలో అతి పెద్ద‌దైన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ZEE5. ఎప్ప‌టిక‌ప్పుడు ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను

Committite Kurrollu:‘కమిటీ కుర్రోళ్ళు’ నుంచి ‘ప్రేమ గారడీ..’ అనే లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

‘అమ్మాయికి మనసులోని ప్రేమను చెప్పాలంటే, ఆమె ఆ ప్రేమకు వెంటనే ఎస్ చెప్పాలంటే సాధార‌ణ విష‌యం కాదు.. మ‌రీ పుట్టిన పెరిగిన ప‌ల్లెటూర్లో

Bharateeyudu 2:‘భారతీయుడు 2’ ట్రైలర్ విడుదల

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో

Shivam Bhaje:'శివం భజే' పవర్ ఫుల్ టీజర్ విడుదల!!

గంగా ఎంటర్టైన్మంట్స్ మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కుతున్న తొలి చిత్రం 'శివం భజే'. ఇదివరకే టైటిల్, ఫస్ట్ లుక్  తో

Shivam Bhaje:గంగా ఎంటర్టైన్మంట్స్ 'శివం భజే' టీజర్ రేపు విడుదల!!

గంగా ఎంటర్టైన్మంట్స్ మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కుతున్న తొలి చిత్రం 'శివం భజే'. అశ్విన్ బాబు హీరోగా