అవార్డులు తెచ్చే పాత్ర‌ల కోసం అంజ‌లా ఆరాటం

  • IndiaGlitz, [Thursday,April 26 2018]

'ప్రేమించుకుందాం రా..' (1997), 'చూడాలని వుంది' (1998), 'సమరసింహారెడ్డి'(1999) లాంటి ఇండస్ట్రీ హిట్స్‌లో నటించి లక్కీ హీరోయిన్ అనిపించుకున్నారు ఉత్త‌రాది భామ అంజ‌లా ఝ‌వేరి. ఆ తర్వాత కూడా కొన్ని పెద్ద‌ సినిమాల్లో సంద‌డి చేసినా.. ఆశించిన విజయాన్ని, గుర్తింపుని ఇవ్వలేకపోయాయి. క్రమేణా సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకుని.. సినిమాలకి కొంత బ్రేక్ ఇచ్చేసింది.

అయితే.. నిన్నటి తరం హీరోయిన్‌లైన మీనా, సిమ్రాన్, భూమిక, నదియా, ఖుష్బూ రీ-ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలతో పాటు భారీగా పారితోషికం అందుకోవడంతో.. ఇప్పుడు వారిలాగే అంజలా ఝ‌వేరి కూడా తెలుగులో రీ-ఎంట్రీ ఇచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

అయితే.. ఈమె మాత్రం పారితోషికం కంటే మంచి అవార్డులను తెచ్చే పాత్రలు ఉంటేనే నటిస్తానని కండిషన్ కూడా పెడుతోందట.  మొత్తానికి.. ఇంతవరకు లక్కీ గర్ల్ అనిపించుకున్న ఈ భామ.. ఇప్పుడు మంచి నటి కూడా అనిపించుకోవాలని తహతహలాడుతున్నట్టు సమాచారం. మరి ఈమెలో ఉండే ఆ 'ఉత్త‌మ నటి'ని బయటకి తీసే  దర్శకుడు ఎవరో మరి కొద్ది రోజుల్లో తెలుస్తుంది.

More News

మ‌హేష్ ప్ర‌తి హిట్ చిత్రంలోనూ..

సినిమాలు విజయం సాధించడానికి కథ, కథనంతో పాటు కాంబినేషన్‌లు కూడా కీలకపాత్రలు పోషిస్తాయి.

ఈ ఏడాది నాని కంటిన్యూ చేయ‌డం లేదా?

హ్యాట్రిక్ హిట్స్‌ అందుకోవడమే అరుదైపోయిన‌ ఈ రోజుల్లో.. ఏకంగా డబుల్ హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు నేచురల్ స్టార్ నాని

రామ్ హీరోగా ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స్ర‌వంతి మూవీస్ చిత్రం ప్రారంభం

కొన్ని కాంబినేష‌న్లు అనూహ్యంగా తెర‌మీద‌కు వ‌స్తాయి. వ‌చ్చినంత  వేగంగానే ఆస‌క్తిని  రేకెత్తిస్తుంటాయి.

ఏప్రిల్ 29న నా పేరు సూర్య ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో చ‌ర‌ణ్‌, మే 4న విడుద‌ల

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో  తెరకెక్కుతున్న చిత్రం 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'.

దేశ‌దిమ్మ‌రి గా త‌నీష్

యంగ్ హీరో త‌నీష్ దేశ‌దిమ్మ‌రి గా ముస్తాబౌతున్నాడు. స‌వీన క్రియేష‌న్స్ ప‌తాకంపై న‌గేష్ నార‌దాసి దర్శకత్వంలొ స్వతంత్ర గోయల్ (శావి USA) ఈ చిత్రాన్ని  తెర‌కెక్కిస్తున్నారు.