సందీప్ సినిమాలో పవన్ పాప..

  • IndiaGlitz, [Sunday,December 06 2015]

అలియాస్ జాన‌కి చిత్రంలో హీరోయిన్‌గా న‌టించిన అనీషా అంబ్రోస్ త‌ర్వాత గోపాల గోపాల' చిత్రంలో చిన్న‌పాత్ర‌లో మెరిసింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌'లో హీరోయిన్‌గా అవ‌కాశం ద‌క్కించుకుంద‌ని వార్త‌లు కూడా వినిపించాయి. అయితే ఆమెను డ్రాప్ చేసి ఇప్పుడు కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నార‌ట‌. ప‌వ‌న్ కాద‌నడంతో అనీషాకు అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. అయితే యంగ్ హీరో సందీప్ కిష‌న్ ఇప్పుడు త‌న రీమేక్ చిత్రం 123'(మ‌ల‌యాళ చిత్రం నేర‌మ్' కు రీమేక్‌)లో ఇద్ద‌రు హీరోయిన్స్‌లో అనీషాను తీసుకున్నారు. మ‌రో హీరోయిన్‌గా కీర్తి సురేష్ న‌టిస్తుంది మ‌రి...