అనీషా ఆంబ్రోస్కి పెళ్లి!
- IndiaGlitz, [Friday,January 25 2019]
అనీషా ఆంబ్రోస్ గుర్తుందా? అలియాస్ జానకి అనే చిత్రంలో నటించింది. నీలిమ తిరుమలశెట్టి నిర్మించిన చిత్రమిది. ఈ సినిమా తర్వాత కూడా అనీషా గోపాలాగోపాలా, మనమంతా, ఒక్కడు మిగిలాడు తదితర చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ఆమె నటిస్తున్న '7' సెట్స్ మీద ఉంది.
అయితే ఈ భామ గుణ జక్క అనే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థం జరిగి కూడా దాదాపు నెల అవుతోందని సన్నిహితుల సమాచారం. ఈ భామ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
అనీషా ఎంగేజ్మెంట్కి ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ని కూడా పిలవలేదు. గుణ సినిమా వ్యక్తి కాదు. పైగా ఈ నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. త్వరలోనే ఆమె పెళ్లి ఉంటుంది. పెళ్లి తర్వాత అనీషా నటిస్తుందా? లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది అని ఆమె సన్నిహితులు తెలిపారు.