మణిశర్మ లాగే అనిరుధ్ కూడా..
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా అంటే క్రియేటివ్ ఫీల్డ్ అనేది చాలా మంది మాట. అయితే ఇది అన్ని సందర్భాల్లోనూ వర్తించే మాట అయితే కాదు. తెలుగులో చాలా పాపులర్ సినిమాలు ఇతర భాషల నుంచి కాపీ వెర్షన్స్‌గా తెరకెక్కాయి.ముఖ్యంగా కొరియన్ సినిమాల నుంచి కాపీ అవుతున్న సినిమాలు ఇటీవల కాలంలో బాగా ఎక్కువయ్యాయి. ఇక పాటల విషయానికి వస్తే.. ఎన్నో పాపులర్ తెలుగు పాటలు.. వెస్ట్రన్ సాంగ్స్, పాప్ సాంగ్స్‌కి కాపీ వెర్షన్స్. తాజాగా విడుదలైన ఒక్క క్షణం చిత్రం(సంగీతం.. మణిశర్మ)లోని సో మెనీ సో మెనీ పాట.. యూట్యూబ్‌లో పాపులర్ అయిన షేప్ ఆఫ్ యు అనే పాటని యథాతథంగా అనుకరించినట్లుంటుంది.
ఇప్పుడు ఇదే వరుసలో మరో రీసెంట్ పాపులర్ సాంగ్ కూడా చేరింది. అదే అజ్ఞాతవాసి చిత్రం(సంగీతం.. అనిరుధ్)లోని గాలివాలుగా అనే పాట. ఇది కూడా కాపీ ట్యూన్‌నే. ఎ గర్ల్ వాక్స్ హోం ఎలోన్ ఎట్ నైట్ అనే మూవీ సౌండ్ ట్రాక్ నుంచి ది వీల్-బ్యూ రు అనే సాంగ్ ట్యూన్‌ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి తెలుగునాట సృజనాత్మకత దారి తప్పుతోందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com