అనిరుధ్, దేవిశ్రీ ప్రసాద్ మిస్.. తమన్ యస్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం....ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. మార్చి 26 నుంచి నిరవధిక చిత్రీకరణ జరుపుకోనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇదిలా వుంటే...గతంలో ఈ సినిమా సంగీత దర్శకుడికి సంబంధించి దేవిశ్రీ ప్రసాద్, అనిరుధ్ పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా మరో యువ సంగీత దర్శకుడు తమన్ పేరును ఖరారు చేసారని కథనాలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో వైవిధ్యమైన సంగీతంతో వరుస విజయాలను (భాగమతి, తొలిప్రేమ) అందుకోవడమే.. తమన్ పేరును ఖరారు చేయడానికి కారణం అని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి...నటరాజ్ సుబ్రహ్మణ్యం సినిమాటోగ్రాఫర్ గా, ఎ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కథానాయికలకు సంబంధించిన వివరాలతో పాటు మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడించనుంది చిత్ర బృందం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout