పవన్ సినిమాకి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...పవర్ స్టార్ సర్దార్ సినిమా తర్వాత ఎస్.జె.సూర్య డైరెక్షన్ లో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.
పవన్ - సూర్య కాంబినేషన్లో ఖుషి, పులి చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రూపొందనున్న మూడో చిత్రం ఇది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా యువ సంగీత సంచలనం అనిరుథ్ ను ఫైనల్ చేసారట. ఈ సినిమా విషయమై డైరెక్టర్ ఎస్.జె.సూర్య, అనిరుథ్ ల మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. తెలుగులో బ్రూస్ లీ, అ ఆ చిత్రాలకు సంగీతం అందించే అవకాశం వచ్చినా..అనిరుథ్ వదులుకున్నాడు. మరి...ఈ క్రేజీ మూవీకి అవకాశం వస్తే... సద్వినియోగం చేసుకుంటాడో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com