స్టార్ డైరెక్టర్ పై అనిరుధ్ సంచలన ట్వీట్..!!
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని, శ్రద్దా శ్రీనాథ్ నటీనటులుగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా 'జెర్సీ'. ఏప్రిల్-19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. టాలీవుడ్ టాప్ స్టార్లు, మూవీ క్రిటిక్స్ సైతం జెర్సీ అద్భుతం అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మంచు మనోజ్, అల్లరి నరేశ్‌తో పాటు పలువురు ప్రముఖులు ‘జెర్సీ’పై ప్రశంసల జల్లు కురిపించారు.
ఇలా అందరూ మెచ్చుకుంటుంటే 'జెర్సీ' మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. " జెర్సీ మూవీపై అద్భుతమైన రివ్యూలు, కామెంట్స్ వస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా జెర్సీ సంగీతం అందరి మెప్పు పొందింది. తెలుగులో ఫస్ట్ బ్లాక్ బాస్టర్ చిత్రం అందించినందుకు హీరో నాని, డైరెక్టర్ గౌతమ్, వంశీ.. జెర్సీ చిత్ర బృందానికి అందరికీ ధన్యవాదాలు" అని అనిరుధ్ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ ఆ డైరెక్టర్ కోసమేనా!?
అంతేకాదు ఆ ట్వీట్‌కు 'నా పనైపోయిందనుకున్నావా.. హ హహ' అని సూపర్‌స్టార్ రజనీకాంత్ డైలాగ్ ఉన్న ఓ వీడియో జతచేశాడు. ఈ ట్వీట్ చూసిన నేచురల్ స్టార్ నాని "హ..హ.. మేమందరం ఇక్కడే ఉన్నాం.. త్వరగా రా.. ఇది పండుగ చేసుకునే టైమ్.." అని కామెంట్ చేశాడు. అయితే అనిరుధ్ ట్వీట్‌కు అర్థాలు చాలా ఉన్నాయని.. ఈ ట్వీట్ తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ డైరెక్టర్‌ను ఉద్దేశించి చేశాడని రూమర్స్ వస్తున్నాయి.
గత ఏడాది ఆ డైరెక్టర్ సినిమాకు సంగీతం అందించగా.. ప్లాప్ అవ్వడంతో ఆ తర్వాత అనిరుధ్‌ను పక్కనపెట్టాడని దీంతో.. 'నా పనైపోయిందనుకున్నా.. ఇప్పుడు చూడు నేనేంటో' అంటూ రివెంజ్‌గా ఆయన ట్వీట్ చేసినట్లుగా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చని క్రిటిక్స్ అంటున్నారు.
Our reaction at the studio after reading all your awesome reviews and comments on the film #Jersey and it’s music ??????
— Anirudh Ravichander (@anirudhofficial) April 19, 2019
Thank you dear @NameisNani @gowtam19 @vamsi84 and the whole team for our first Telugu blockbuster ?????? pic.twitter.com/qwVS5j5z9p
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments