రాజమౌళి RRRకి అనిరుధ్ జోష్.. కిక్కు పెంచడానికే..
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర హీట్ నెమ్మదిగా పెరుగుతోంది. ఇటీవల విడుదల చేసిన మేకింగ్ వీడియో రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ఉన్న అంచనాలని అమాంతం రెట్టింపు చేసేసింది. అక్టోబర్ 13నే రిలీజ్ డేట్ గా ఖరారు చేయడంతో ప్రమోషన్స్ జోరు పెంచాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: సుభాస్కరన్ నిర్మిస్తున్న భారీ విజువల్ వండర్ ‘పొన్నియన్ సెల్వన్–1’ 2022లో విడుదల
రాజమౌళి సినిమా మేకింగ్ ఎలా ఉంటుందో.. అదే స్థాయిలో ప్రచారానికి కూడా ప్రాధాన్యత ఇస్తారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ జోరందుకోనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే.. యంగ్సెన్సేషనల్ మ్యుజీషియన్ అనిరుధ్ రవిచందర్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగం కాబోతున్నాడట.
రాజమౌళి, కీరవాణి ఆ విధంగా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఆర్ఆర్ఆర్ చిత్రానికి జక్కన్న ఓ ప్రమోషనల్ సాంగ్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సాంగ్ కు అనిరుధ్ గాత్రంతో పాటు, డాన్స్ పెర్ఫామెన్స్ కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా ఉండేందుకు అనిరుధ్ ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ప్రమోషనల్ సాంగ్స్ కి పెర్ఫామెన్స్ ఇవ్వడంలో అనిరుద్ స్టయిలే వేరు. అనిరుధ్ క్రేజీ సంగీత దర్శకుడు మాత్రమే కాదు..మంచి సింగర్, డాన్సర్ కూడా. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు స్వాతంత్ర యోధులు అల్లూరి, కొమరం భీం పాత్రలతో జక్కన్న అల్లిన కల్పిత గాధ ఆర్ఆర్ఆర్ చిత్రం. రాంచరణ్ అల్లూరిగా, ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
అజయ్ దేవగన్, అలియా భట్, ఒలీవియా మోరిస్, ఆలిసన్ డూడి, రే స్టీవెన్సన్, సముద్రఖనికీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ సాంగ్ షూట్ మినహా మిగిలిన పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. డివివి దానయ్య భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout