Animal:యూట్యూబ్‌లో అదరగొడుతోన్న 'యానిమల్' ట్రైలర్
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన యానిమల్ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌లో దూసుకుపోతుంది. కొద్దిసేపటి క్రితం చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. 3 నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్ మొత్తం తండ్రికొడుకుల మధ్య ప్రేమానురాగాల నేపథ్యంలోనే సాగింది. హీరో చిన్నప్పటి నుంచి తండ్రిని విపరీతంగా ద్వేషిస్తూ.. తర్వాత ప్రేమిస్తున్నట్లు చూపించారు. టైటిల్‌కి తగిలినట్లుగానే హీరో క్యారెక్టర్ వైల్డ్‌గా ప్రజెంట్ చేశారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ డ్రామా ప్రధానంగా ఈ ట్రైలర్ కట్ చేశారు.
హీరో తండ్రిగా అనిల్ కపూర్ నటించగా, హీరో భార్య పాత్రలో రష్మిక కనిపిస్తోంది. విలన్‌గా బాబీ డియోల్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, ఇతర పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా నిడివి 3 గంటల 21 నిమిషాలు ఉందని మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ మధ్య కాలంలో ఇంత నిడివి కలిగిన బాలీవుడ్ సినిమా ఇదే కావడం విశేషం. ఈ మూవీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గతంలో తెరకెక్కించిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ మూవీల రన్ టైం కూడా 3గంటల పైనే ఉంది. ఇప్పుడు ఈ మూవీ ఏకంగా 3 గంటల 21 నిమిషాలు ఉండటం హాట్ టాపిక్ అయింది.
ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ సంస్థలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముందుగా ఆగస్టు 11న సినిమాను విడుదల చేయాలని భావించినా.. వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో రిలీజ్ వాయిదా పడింది. మొత్తానికి టీజర్, పాటలు, ట్రైలర్‌తో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ఈ మూవీ ఎలాంటి బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments