Animal:ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో సత్తా చాటిన 'యానిమల్'.. ఉత్తమ నటుడు ఎవరంటే..?

  • IndiaGlitz, [Monday,January 29 2024]

హిందీ చిత్ర పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఫిల్మ్‌ఫేర్‌’ (Film Fare awards) అవార్డుల్లో 'యానిమల్' చిత్రం సత్తా చాటింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ వేదికగా 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుకల అంగరంగ వైభవం జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక పలువురు బాలీవుడ్ తారలు తమ డ్యాన్స్‌లతో సందడి చేశారు. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి ఈ అవార్డులు ప్రకటించారు.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్ హీరోగా నటించిన 'యానిమల్' చిత్రం బ్లాక్‌బస్టర్‌ అయిన సంగతి తెలిసిందే. రూ.900కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది. ఈ అవార్డుల్లోనూ దుమ్మురేపింది. ఇక ఓటీటీలో విడుదలైన '12th ఫెయిల్‌' చిత్రం కూడా ఐదు అవార్డులు సొంతం చేసుకుంది. ఈ రెండు సినిమాలకు అవార్డుల పంట పడింది. ఇదిలా ఉంటే భార్యాభర్తలు రణ్‌బీర్, అలియాభట్‌ ఉత్తమ నటుడు, నటి అవార్డులు అందుకుని చరిత్ర సృష్టించారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే భార్యాభర్తలిద్దరికి ఉత్తమ నటుడు, నటి అవార్డులు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

అవార్డుల జాబితా ఇదే..

ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్‌

ఉత్తమ నటుడు: రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌)

ఉత్తమ చిత్రం(క్రిటిక్స్‌): జొరామ్‌

ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్‌ (డంకీ)

ఉత్తమ దర్శకుడు: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): విక్రాంత్‌ మెస్సె (12th ఫెయిల్‌)

ఉత్తమ నటి: అలియా భట్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)

ఉత్తమ నటి (క్రిటిక్స్‌): రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే),
షఫాలీ షా (త్రీ ఆఫ్‌ అజ్‌)

ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)

ఉత్తమ గీత రచయిత: అమితాబ్‌ భట్టాచార్య (తెరె వాస్తే..: జరా హత్కే జరా బచ్కే)

ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బం: యానిమల్‌

ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్‌ బాబల్‌ ( అర్జన్‌ వెయిలీ- యానిమల్‌)

ఉత్తమ డైలాగ్‌: ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)

ఉత్తమ నేపథ్య గాయకురాలు: శిల్పా రావు (చెలెయ- జవాన్‌)

ఉత్తమ కథ: అమిత్‌ రాయ్‌ (OMG 2)

ఉత్తమ స్క్రీన్‌ప్లే: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)