14 రీల్స్ సంస్థ గర్వంగా అందిస్తున్న చిత్రం హైపర్ - నిర్మాత అనిల్ సుంకర
Tuesday, September 27, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జిటిక్ హీరో రామ్ - కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీన్ వాస్ కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ హైపర్. ఈ చిత్రంలో రామ్ సరసన రాశీ ఖన్నా నటించింది. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన హైపర్ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈనెల 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.
ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో నిర్మాత గోపీచంద్ ఆచంట మాట్లాడుతూ...రామ్ కెరీర్ లోనే హయ్యస్ట్ థియేటర్స్ లో హైపర్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. ఈనెల 29న యు.ఎస్ లో ప్రీమియర్ షోస్ ప్లాన్ చేసాం. యు.ఎస్ లో మొత్తం 192 స్ర్కీన్స్ లో రిలీజ్ చేస్తున్నాం. జూన్ 3న ప్రారంభించిన ఈ చిత్రాన్ని 72 రోజులు షూటింగ్ చేసి పూర్తి చేసాం. ఈ సినిమా ప్రారంభోత్సవం రోజే దసరా కానుకగా రిలీజ్ చేస్తాం అని ఎనౌన్స్ చేసాం. వైజాగ్, హైదరాబాద్ లో వర్షాలు పడడంతో నాలుగు రోజులు షూటింగ్ కి ఇబ్బంది అయ్యింది. మిగతా అంతా మేం ప్లాన్ చేసినట్టే జరిగింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ బాగా కోపరేట్ చేయడంతో అనుకున్న విధంగా షూటింగ్ కంప్లీట్ చేసాం. అబ్బూరి రవి సందర్భానుసారంగా మంచి డైలాగ్స్ అందించారు. మంచి కథతో ఓ మంచి సినిమా చేసాం. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం అన్నారు.
డైరెక్టర్ సంతోష్ శ్రీన్ వాస్ మాట్లాడుతూ...అనుకున్న విధంగా షూటింగ్ పూర్తి చేసి హైపర్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. హైపర్ మంచి సినిమా. అందరికీ కనెక్ట్ అవుతుంది. ప్రతి తండ్రి - కొడుకుకు నచ్చే సినిమా ఇది.రామ్ తో సినిమా చేద్దాం అనుకున్న తర్వాత కందిరీగ కంటే బెస్ట్ మూవీ చేయాలి ఎలాంటి సినిమా చేయాలి అని నిర్ణయించడం కోసమే 4 నాలుగు డిస్కషన్స్ చేసి ఈ కథను ఫైనల్ చేసాం. మంచి కథ చెబితే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సక్సెస్ - ఫెయిల్యూర్ మన చేతుల్లో ఉండవు కాబట్టి వాటి గురించి ఆలోచించకుండా ఓ మంచి సినిమా అందిస్తున్నాం. ఈ మూవీ కోసం ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ డే & నైట్ వర్క చేసారు. నేను కాంప్రమైజ్ అయ్యానేమో కానీ...మా నిర్మాతలు మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. జిబ్రాన్ మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే మణిశర్మ ఎక్స్ ట్రార్డినరీ రీ రికార్డింగ్ అందించారు అన్నారు.
నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ...14 రీల్స్ ఈ హైపర్ చిత్రాన్ని అందిస్తున్నందుకు సంతోషంగా గర్వంగా ఉంది. ఈ సినిమా ఇంత బాగా వచ్చింది అంటే 99% క్రెడిట్ డైరెక్టర్ వాసుకే చెందుతుంది. ఈ సినిమా ధియేటర్స్ కి తండ్రి - కొడుకు కలిసి వస్తే..ఓ కూపన్ ఇస్తారు. అలా వచ్చిన కూపన్స్ లో డ్రా తీసి గెలిచినవాళ్లకు చదువుకునేందు గాను 5 లక్షలు అందచేయనున్నాం అన్నారు.
నిర్మాత రామ్ ఆచంట మాట్లాడుతూ... వాసు మోచ్యూర్డ్ డైరెక్టర్. రామ్ కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది అని మా నమ్మకం. ఈ సినిమాలో ఫాదర్ - సన్ రిలేషన్ తో పాటు మరో యాంగిల్ ఉంది. అది ఈ సినిమాని మరో స్టెప్ ముందుకు తీసుకెళుతుంది అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments