ఆహా కోసం అనీల్ రావిపూడి..!
Send us your feedback to audioarticles@vaarta.com
కుర్ర దర్శకుల్లో అనీల్ రావిపూడి కమర్షియల్ సినిమాల డైరెక్టర్‌గా తనకంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. తొలి చిత్రం పటాస్ నుండి ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సరిలేరునీకెవ్వరు సినిమా వరకు హిట్ సినిమాలను తెరకెక్కించిన అనీల్ రావిపూడి తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఎఫ్ 3 సినిమాను తెరకెక్కించే అవకాశాలున్నాయి. అయితే కరోనా ప్రభావంతో ఈ సినిమా ట్రాక్ ఎక్కడానికి మరింత సమయం పట్టేలా కనపడుతుంది. అయితే ఈలోపు అనీల్ రావిపూడి ఓ కొత్త టర్న్ తీసుకోబోతున్నాడని వార్తలు వినపడుతున్నాయి.
సినీ వర్గాల్లో వినపడుతున్న సమాచారం మేరకు సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ స్టార్ట్ చేసిన తెలుగు డిజిటల్ యాప్ ఆహా కోసం అనీల్ రావిపూడి ఓ వెబ్ సిరీస్‌ను చేయబోతున్నాడట. ఆహా యాప్‌ను తెలుగు ప్రేక్షకులకు రీచ్ చేయించడానికి అల్లు అరవింద్ పలువురు దర్శకులు, రైటర్స్‌తో డిస్కస్ చేస్తూ కంటెంట్‌ను రెడీ చేయిస్తున్నారు. ఆ క్రమంలో అనీల్ రావిపూడితో ఓ కామెడీ వెబ్ సిరీస్‌ను అరవింద్ ప్లాన్ చేశాడట. తదుపరి సినిమా షూటింగ్ మొదలయ్యే లోపలే అనీల్ ఈ వెబ్ సిరీస్‌ను పూర్తి చేసేలా ప్లాన్స్ చేసుకుంటున్నాడని టాక్. త్వరలోనే సమాచారం వెలువడనుందంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com