మెగాస్టార్ ఊ అంటే నేను రెడీ : అనిల్ రావిపూడి
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్‌లో వరుస హిట్‌లను తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. మరీ ముఖ్యంగా విభిన్నమైన కథలను ఎంచుకోవడం.. వినోదభరితంగా తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. ఈయన సినిమాల్లో కామెడీకి మాత్రం అస్సలు కొదవుండదు. ఆయన తెరకెక్కించిన సినిమాలు చూస్తే అర్థం చేసుకోవచ్చు. అలా తనకంటూ ఓ ట్రెండ్ సెట్ చేసుకుంటూ అతి తక్కువ కాలంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను అనిల్ తెరకెక్కించాడు. ఈ సినిమా జనవరి 11న భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్రబృందం.. తాజాగా అనిల్ రావిపూడి మీడియా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఉంటుందా..? అని మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్న ఎదురవ్వగా ఎలా రియాక్ట్ అయ్యారో చూడండి.
మీడియా: ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చిరంజీవి మీ గురించి చాలా బాగా మాట్లాడారు కదా! ఆయనతో సినిమా చేసే ఆలోచన ఉందా?
అనిల్ : ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవిగారు రావడం నా అదృష్టం. నా గురించి ఆయన మాట్లాడిన నాలుగు మాటలు నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఆయనతో సినిమా చేయాలని ఎవరికి ఉండదు? అలాగే ఆయనతో సినిమా చేయాలని నాకూ వుంది. ఆ అవకాశం సాధ్యమైనంత త్వరగా రావాలని కోరుకుంటున్నాను. చిరంజీవిగారు ‘ఊ’ అనాలే కానీ మూడు నెలల్లో కథ రెడీ చేస్తాను’ అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.
అంటే సూపర్‌స్టార్ తర్వాత మెగాస్టార్‌తో సినిమా తీయాలని అనిల్ తహతహలాడుతున్నాడన్న మాట. మరి ఈ ముచ్చట తీరాలంటే సరిలేరు ఏ మాత్రం సక్సెస్ అవుతుందో వేచి చూసిన తర్వాతే తెలుస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com