ఈసారైనా వర్కవుట్ అవుద్దా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జిటిక్‌స్టార్ రామ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రెండేళ్ల క్రితం ఓ సినిమాను రూపొందించడానికి నిర్మాత స్రవంతి రవికిషోర్ ప్రయత్నం చేశాడు. అయితే ఆ ప్రయత్నం వర్కవుట్ కాలేదు. ముందు సినిమా చేయడానికి ఓకే చెప్పిన రామ్ తర్వాత ప్రాజెక్ట్ నుండి డ్రాప్ అవుతున్నట్లు ప్రకటించాడు. చివరికి ఆ ప్రాజెక్ట్‌ని రవితేజతో ‘రాజాది గ్రేట్' పేరుతో అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. సినిమా మంచి విజయాన్నే సాధించింది. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి మోస్ట్ వాంటెడ్ కమర్షియల్ డైరెక్టర్‌గా మారాడు. మహేశ్‌తో ‘సరిలేరునీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు. దీంతో మరోసారి స్రవంతి రవికిషోర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మరోసారి సినిమా చేయడానికి అది కూడా రామ్ హీరోగా అనుకుని చర్చలు చేస్తున్నాడట. అనిల్ రావిపూడి కూడా అందుకు సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఈ దర్శకుడు మహేశ్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాతనే రామ్‌తో కథా చర్చలు చేస్తాడని వార్తలు వినపడుతున్నాయి.
మరో పక్క రామ్ కూడా స్రవంతి రవికిషోర్ నిర్మాతగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రెడ్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాల తర్వాత రామ్, కిషోర్ తిరుమల కాంబినేషన్‌లోరూపొందుతోన్న చిత్రం కావడంతో సినిమాపై మంచిఅంచనాలు నెలకొన్నాయి. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ పేర్లు హీరోయిన్స్‌గా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దీని తర్వాతనే రామ్, అనిల్ రావిపూడి సినిమా ఉంటుందని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com