విజయశాంతిపై అనీల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ పోస్ట్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకట్రెండు కాదు ఏకంగా 13 ఏళ్ల గ్యాప్ తర్వాత విజయశాంతి అలియాస్ రాములమ్మ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించి చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’లో రాములమ్మ కీలక పాత్ర పోషించి.. తనలో ఇంకా నటన ఉందని నిరూపించుకుంది. ఆమె పాత్ర సినిమాకు ఓ ప్లస్ పాయింట్ అవ్వడమే కాదు.. ఆమె పాత్ర ఎలా ఉంటుందనే ఇంట్రెస్ట్‌తో సినిమాకు వెళ్లిన జనాలు కూడా ఉన్నారు. అయితే ఆ తర్వాత ఇక సినిమాలకు దూరమయ్యారు. సడన్‌గా ఇప్పటికి ఇక సెలవు అంటూ ఓ పోస్ట్ చేసి అభిమానులకు ఒకింత షాకిచ్చింది. అలా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె రాజకీయాలకు సంబంధించి మాత్రం సోషల్ మీడియాలో రోజుకో పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటూ వస్తోంది.
వరుస ట్వీట్ల వర్షం!
అయితే.. ఆమె నటించి మెప్పించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది. సినిమా రిలీజ్ అయ్యి నేటికి 50 రోజులు. ఈ సందర్భంగా చిత్రబృందం ఎంతో హ్యాపీగా ఉంది. ఇందుకు సంబంధించి అనిల్ రావిపూడి, మహేశ్ ఇరువురూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లపై మహేశ్ అభిమానులు, సినీ ప్రియులు స్పందిస్తూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ క్రమంలో అనీల్ మాత్రం విజయశాంతిపై ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశాడు.
నాకు దక్కిన అరుదైన గౌరవం!
విజయశాంతి మేడమ్.. ‘నిజంగా మీతో కలిసి పని చేయడం చిరకాలం గుర్తుండిపోయే ఓ అనుభవం. చాలా కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై మీరు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. అంతేకాదు.. ఆ సినిమాకు నేను దర్శకత్వం వహించే అవకాశం రావడం నాకు దక్కిన అరుదైన గౌరవం లాగా భావిస్తున్నా. ఈ సినిమాలో మీరు నటించిన తీరు నటనా నైపుణ్యాలు శాశత్వం అని నిరూపించింది’ అని రాసుకొచ్చిన ఆయన.. షూటింగ్ టైమ్‌లో రాములమ్మ కలిసి దిగిన ఓ ఫొటోను కూడా షేర్ చేశాడు.
ఈ ట్వీట్‌కు అభిమానులు, మహేశ్ అభిమానులు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతూ కామెంట్స్ చేస్తూ షేర్లు, లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు.. మహేశ్ బాబుతో ‘బిజినెస్‌మెన్’ టైపులో సినిమా ప్లాన్ చేయండి సార్ అంటూ అనిల్‌కు సూపర్‌స్టార్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com