వంశీ పైడిపల్లి బాటలోనే అనిల్ రావిపూడి
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు ప్రేక్షకులకు దూరమైపోయిన మల్టీస్టారర్ చిత్రాలను మళ్ళీ 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో గుర్తు చేసారు టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ 'దిల్' రాజు. టాలీవుడ్ అగ్ర కథానాయకులు వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా కనిపించిన ఈ సినిమా మళ్ళీ తెలుగులో మల్టీస్టారర్ మూవీలు రూపుదిద్దుకోవడానికి ఊపిరి పోసింది. అలాగే.. ఇదే బ్యానర్‌పై మరో మెగా మల్టీస్టారర్ మూవీని కూడా నిర్మించారు 'దిల్' రాజు.
'దిల్' రాజు నిర్మాణంలో వరుసగా 'మున్నా', 'బృందావనం' లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి.. తన మూడో చిత్రంగా ఈ మల్టీస్టారర్ మూవీని డైరెక్ట్ చేసారు. వంశీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ 'ఎవడు' మూవీలో మెగా హీరోస్ అల్లు అర్జున్, రామ్ చరణ్ కలిసి స్క్రీన్‌ను పంచుకున్న విషయం తెలిసిందే.
కట్ చేస్తే.. వంశీ లాంటి అవకాశాన్ని మరో యంగ్ డైరెక్టర్‌కి కూడా ఇచ్చారు 'దిల్' రాజు. తన నిర్మాణంలో వరుసగా 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్' సినిమాలను తెరకెక్కించిన అనిల్ రావిపూడితో థర్డ్ ఫిల్మ్‌గా మల్టీస్టారర్ మూవీ 'ఎఫ్-2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్'ని నిర్మిస్తున్నారు రాజు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతున్న ఈ చిత్రం జూలై 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. కాగా.. ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదల కానుంది.
మరి వంశీ లాగే అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. అనిల్ తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంటారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments