కొంత ఫ్రస్టేషన్ రిలీఫ్.. ఫన్ అంటూ ఛాలెంజ్ పూర్తి అనీల్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం టాలీవుడ్‌లో సవాళ్ల ట్రెండ్ నడుస్తోంది. ఇంతకూ ఎలాంటి సవాలనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఛాలెంజ్ ఏంటంటే ‘బీ ద రియల్ మేన్’ సందీప్ వంగా స్టార్ట్ చేసిన ఈ ఛాలెంజ్‌లో సినీ తారలందరూ పాల్గొంటున్నారు. రాజమౌళి, తారక్, చరణ్, చిరంజీవి, వెంకటేశ్, ఎం.కీరవాణి, శోభు యార్లడ్డ ఇలా అందరూ ఛాలెంజ్‌లో పాల్గొనడమే కాకుండా తమకు నచ్చిన వారిని ఛాలెంజ్‌లో పాల్గొనాలంటూ నామినేట్ చేస్తున్నారు. క్రమంగా ఇందులో నామినేషన్ సంఖ్య పెరుగుతూ వస్తుంది. విక్టరీ వెంకటేశ్ ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఆయన డైరెక్టర్ అనీల్ రావిపూడిని నామినేట్ చేశారు.
ఛాలెంజ్‌ను స్వీకరించిన అనీల్ రావిపూడి దాన్ని పూర్తి చేశారు. ఆ వీడియో ట్వీట్ చేస్తూ ‘ఇంట్లో వాళ్ళకి కొంత ఫ్రస్ట్రేషన్ రిలీఫ్. మనకి కొంత ఫన్’ అంటూ మెసేజ్ కూడా పోస్ట్ చేశారు. ఇంటిని శుభ్రం చేసిన అనీల్ పనులు చేసేటప్పుడు బ్యాగ్రౌండ్‌లో వివాహా భోజనంబు సినిమాలోని సుత్తివీరభద్రరావు, బ్రహ్మానందంకు సంబంధించిన కామెడీ ట్రాక్ రన్ అవుతుంది. ఛాలెంజ్‌ను పూర్తి చేసిన అనీల్ తన తరపున మాస్ మహారాజా రవితేజ, నందమూరి కల్యాణ్ రామ్‌తో పాటు మెగా క్యాంప్ హీరో సాయితేజ్‌లను నామినేట్ చేశారు. ఈ ముగ్గురు హీరోలు అనీల్ రావిపూడి దర్శకత్వంలో పనిచేయడం విశేషం. అనీల్ రావిపూడి ఈ ఏడాది మహేశ్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’వంటి బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నారు. ప్రస్తుతం ఎఫ్ 3 కోసం స్ర్కిప్ట్‌ను సిద్దం చేసే పనిలో ఉన్నారు అనీల్ రావిపూడి
Here is my #BeTheRealMan challenge video @VenkyMama garu.
— Anil Ravipudi (@AnilRavipudi) April 24, 2020
ఇంట్లో వాళ్ళకి కొంత ఫ్రస్ట్రేషన్ రిలీఫ్. మనకి కొంత ఫన్.
I nominate my PATAAS @NandamuriKalyan, my SUPREME @IamSaiDharamTej and my RAJA THE GREAT @RaviTeja_Offl to take forward the challenge ???? pic.twitter.com/jXmNoQscbD
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments