కొంత ఫ్ర‌స్టేష‌న్ రిలీఫ్‌.. ఫ‌న్ అంటూ ఛాలెంజ్ పూర్తి అనీల్

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో స‌వాళ్ల ట్రెండ్ న‌డుస్తోంది. ఇంత‌కూ ఎలాంటి స‌వాలనే విష‌యాన్ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ ఛాలెంజ్ ఏంటంటే ‘బీ ద రియ‌ల్ మేన్‌’ సందీప్ వంగా స్టార్ట్ చేసిన ఈ ఛాలెంజ్‌లో సినీ తార‌లంద‌రూ పాల్గొంటున్నారు. రాజ‌మౌళి, తార‌క్‌, చ‌ర‌ణ్‌, చిరంజీవి, వెంక‌టేశ్‌, ఎం.కీర‌వాణి, శోభు యార్ల‌డ్డ ఇలా అంద‌రూ ఛాలెంజ్‌లో పాల్గొన‌డ‌మే కాకుండా త‌మ‌కు న‌చ్చిన వారిని ఛాలెంజ్‌లో పాల్గొనాలంటూ నామినేట్ చేస్తున్నారు. క్ర‌మంగా ఇందులో నామినేష‌న్ సంఖ్య పెరుగుతూ వ‌స్తుంది. విక్ట‌రీ వెంక‌టేశ్ ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఆయ‌న డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడిని నామినేట్ చేశారు.

ఛాలెంజ్‌ను స్వీక‌రించిన అనీల్ రావిపూడి దాన్ని పూర్తి చేశారు. ఆ వీడియో ట్వీట్ చేస్తూ ‘ఇంట్లో వాళ్ళకి కొంత ఫ్రస్ట్రేషన్ రిలీఫ్. మనకి కొంత ఫన్’ అంటూ మెసేజ్ కూడా పోస్ట్ చేశారు. ఇంటిని శుభ్రం చేసిన అనీల్ ప‌నులు చేసేట‌ప్పుడు బ్యాగ్రౌండ్‌లో వివాహా భోజ‌నంబు సినిమాలోని సుత్తివీర‌భ‌ద్ర‌రావు, బ్ర‌హ్మానందంకు సంబంధించిన కామెడీ ట్రాక్ ర‌న్ అవుతుంది. ఛాలెంజ్‌ను పూర్తి చేసిన అనీల్ త‌న త‌ర‌పున మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, నంద‌మూరి కల్యాణ్ రామ్‌తో పాటు మెగా క్యాంప్ హీరో సాయితేజ్‌ల‌ను నామినేట్ చేశారు. ఈ ముగ్గురు హీరోలు అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ప‌నిచేయ‌డం విశేషం. అనీల్ రావిపూడి ఈ ఏడాది మ‌హేశ్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను అందుకున్నారు. ప్ర‌స్తుతం ఎఫ్ 3 కోసం స్ర్కిప్ట్‌ను సిద్దం చేసే పనిలో ఉన్నారు అనీల్ రావిపూడి

More News

నేను నీలకంఠుడ్ని.. బెదిరించే వాళ్లను లెక్క చేయను!

విలక్షణ నటుడిగా పేరుగాంచిన ప్రకాశ్ రాజ్ సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుంటారన్న విషయం తెలిసిందే. కాగా.. గతంలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా

రాజమౌళిలో అదొక్కటే నాకు నచ్చదు..: కీరవాణి

దర్శకధీరుడు, టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన రాజమౌళి అలియాస్ జక్కన్న గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ పేరుకే ఓ చరిత్ర ఉంది. ఈయన తెరకెక్కించిన ‘బాహుబలి’

కరోనా తర్వాత పారితోషికంపై ప్రకాశ్ రాజ్ ఏమన్నారంటే..

కరోనా మమమ్మారి కాటేస్తున్న తరుణంలో సినిమా రిలీజ్‌లు, షూటింగ్‌లు సర్వం బంద్ అయ్యాయి. దీంతో నిర్మాతలపై గట్టిగా దెబ్బ పడింది. బహుశా కరోనా ముందు.. కరోనా తర్వాత పరిస్థితులు

నేను ఎంత వాడినో నాకే తెలియదు : ప్రకాష్ రాజ్

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న కాలంలో లాక్ డౌన్ పొడిగించడంతో నిరుపేదలు, వలస కార్మికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు తమ వంతుగా

నేడు కేసీఆర్ పెళ్లి రోజు.. వెల్లువలా శుభాకాంక్షలు

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతుల పెళ్లిరోజు ఇవాళ. అంతేకాదు జోగునపల్లి రవీందర్ రావుది కూడా ఇవాళే పెళ్లిరోజు.