‘ఎఫ్3’పై పెదవి విప్పిన అనిల్
Send us your feedback to audioarticles@vaarta.com
సంక్రాంతి పండుగ.. అనిల్ రావిపూడికి బాగా కలిసి వచ్చింది. వరుసగా రెండో ఏడాది కూడా భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సాధించిన హిట్‌తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో అతని స్థానం మరింత సుస్థిరమైంది.
తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్‌పై ఓ హింట్ ఇచ్చాడు అనిల్. 2019లో ‘ఎఫ్2’గా వచ్చి ప్రేక్షకులకు కితకితలు పెట్టిన అనిల్.. అంతకంటే ఫన్ అందించేందుకు రెడీ అవుతున్నాడు. ఎఫ్2కి సీక్వెల్ రాబోతున్నట్టు ఓ కార్యక్రమంలో ప్రకటించాడు. ‘ఎఫ్3’గా ప్రేక్షకులను పలకరించనున్నట్టు చెప్పాడు. వెంకీ, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్‌లతోనే మరోసారి ఆ మ్యాజిక్ చేయనున్నాడు. దీనికి కూడా దిల్ రాజే నిర్మాత.
మొదటి సినిమాలో ఫన్ అండ్ ఫ్రస్టేషన్ చూపించిన అనిల్.. ఎఫ్3లో ‘ఫన్, ఫ్రస్ట్రేషన్ అండ్ మోర్ ఫన్’ చూపించబోతున్నాడు. మొదటి భాగంలో ప్రేమ, పెళ్లి ప్రధాన అంశాలు కాగా.. సీక్వెల్‌లో కెరీర్ అండ్ గోల్స్ చుట్టూ సినిమా నడుస్తుందట. దీనిపై పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇదిలా ఉంటే.. మహేశ్ బాబు, రష్మిక మందన్నా జంటగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొడుతోంది. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా కూడా పోటా పోటీగా దూసుకువెళుతోంది. రెండు సినిమాలు మంచి సక్సెస్ సొంతం చేసుకున్నాయి. ఇటు అనిల్.. అటు త్రివిక్రమ్ ఇద్దరూ చెరో విజయాన్ని తమ అకౌంట్‌లో వేసుకున్నారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో రెండు చిత్రాలు విజయం సాధించాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments