ఆనందయ్య మందు పంపిణీకి అభ్యంతరం లేదు: అనిల్ కుమార్ సింఘాల్

  • IndiaGlitz, [Monday,May 24 2021]

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీకి క్రమక్రమంగా లైన్ క్లియర్ అవుతోంది. పంపిణీకి అభ్యంతరం లేదని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆయుష్ ఇచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. రీసెర్చ్‌కి వెళ్లిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడామని అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఆనందయ్య మందు నమూనాలను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపామని తెలిపారు. మందులో నష్టం కలిగించే పదార్థాలు లేవని తేలిందని సింఘాల్ వెల్లడించారు.

ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చాకు తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. అయితే దీన్ని ఆయుర్వేద మందుగా గుర్తించలేమన్నారు. అలా చేయాలంటే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం శాస్త్రీయతపై ఇతర అనుమతులు అవసరమవుతాయని అనిల్ కుమార్ తెలిపారు. కేంద్ర ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ వారితో కూడా మాట్లాడామని, ఈ మందు వాడినవారిపై ఎలాంటి ప్రభావం ఉందో డేటా సేకరిస్తున్నామని ప్రకటించారు. ఆయుర్వేదిక్ మెడిసిన్‌గా నోటిఫై చేయకుండా ఉంటే.. దానికి అనుమతులు అవసరం లేదని చెప్పారు. దీనిపై నివేదిక వచ్చాక క్లారిటీ వస్తుందని అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.

ఆనందయ్య మందును ప్రజలకు చేరువ చేయడంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టారని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి వివరించారు. దీన్ని వాడటం వల్ల ఇబ్బందులు లేవని తేలితే పంపిణీకి అడ్డంకులు తొలిగినట్లేనని పేర్కొన్నారు. ప్రభుత్వం అనుమతించిన వెంటనే జిల్లా వ్యాప్తంగా ప్రజలకు ఆనందయ్య మందును పంపిణీ చేసే బాధ్యత తనదని కాకణి గోవర్థన్ రెడ్డి వెల్లడించారు.

More News

టీకా వేసుకుంటే బీరు ఫ్రీ.. అంతేకాదు..

అమెరికాలో హామీల వర్షం కురుస్తోంది. ఏదైనా ఎన్నికలా.. ఆల్రెడీ పూర్తయ్యయి కదా అని ఆలోచిస్తున్నారా? ఎన్నికల హామీలు కావవి.. ప్రస్తుతం అమెరికాలో ఉచిత కొవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది.

హత్య కేసులో రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్

జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్‌కర్ (23) హత్య కేసులో నిందితుడిగా ఉన్న డబుల్‌ ఒలింపిక్‌ పతక విజేత రెజ్లర్ సుశీల్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత 15 రోజులుగా సుశీల్ పరారీలో ఉన్నాడు.

సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఇంటిని బాంబుతో పేల్చివేస్తా మంటూ బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ నిర్వహించగా..

డెలివరీ బాయ్స్‌కు లైన్ క్లియర్..

తెలంగాణలో లాక్‌డౌన్ ప్రారంభమై నేటికి 12 రోజులవుతోంది. 10 రోజుల వరకూ చూసీచూడనట్టుగా వ్యవహరించిన పోలీసులు.. శనివారం నుంచి లాఠీకి పనిజెప్పారు. చివరకు స్విగ్గీ, జొమాటో

మందు తయారీలో హానికర పదార్థాలు లేవు: ఆయూష్ కమిషనర్

ఆనందయ్య ఆయుర్వేద ఔషధంపై ఏపీ ఆయుష్ కమిషన్ పరిశీలన ముగిసింది. ఆనందయ్య ఎలాంటి హానికర పదాదార్థాలను వాడటం లేదని ఏపీ ఆయూష్ కమిషనర్ రాములు వెల్లడించారు.