ఫైనలైజ్ చేయలేదన్న అనిల్
Send us your feedback to audioarticles@vaarta.com
పటాస్ వంటి విజయవంతమైన చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు అనిల్ రావిపూడి. ఆ తరువాత సుప్రీమ్, రాజా ది గ్రేట్ చిత్రాల సక్సెస్‌తో హ్యాట్రిక్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. కాగా, తన తదుపరి చిత్రాన్ని మల్టీస్టారర్ మూవీగా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు అనిల్. ఎఫ్ 2 పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకి ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనేది ట్యాగ్ లైన్.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు నటిస్తుండగా.. వారిలో ఒకరిగా సీనియర్ కథానాయకుడు వెంకటేష్ నటించబోతున్నారని.. మరో హీరోగా సాయిధరమ్ తేజ్ నటించే అవకాశముందని వార్తలు వినిపించాయి. అయితే తన సినిమాలో ఆర్టిస్టులెవరూ ఫైనలైజ్ కాలేదని.. అఫీషియల్‌గా చెప్పే వరకు కాస్త వెయిట్ చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
కాగా, సుప్రీమ్, రాజా ది గ్రేట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తన గత చిత్రాలకు మించి ఈ సినిమాని వినోదాత్మకంగా తెరకెక్కించేందుకు అనిల్ ప్లాన్ చేశాడని సమాచారమ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com