ఫైన‌లైజ్ చేయ‌లేద‌న్న అనిల్‌

  • IndiaGlitz, [Monday,November 13 2017]

ప‌టాస్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మయ్యాడు అనిల్ రావిపూడి. ఆ త‌రువాత సుప్రీమ్‌, రాజా ది గ్రేట్ చిత్రాల స‌క్సెస్‌తో హ్యాట్రిక్ డైరెక్ట‌ర్ అనిపించుకున్నాడు. కాగా, త‌న త‌దుప‌రి చిత్రాన్ని మ‌ల్టీస్టార‌ర్ మూవీగా చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నాడు అనిల్. ఎఫ్ 2 పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్ అనేది ట్యాగ్ లైన్‌.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోలు న‌టిస్తుండ‌గా.. వారిలో ఒక‌రిగా సీనియ‌ర్ క‌థానాయ‌కుడు వెంక‌టేష్ న‌టించ‌బోతున్నార‌ని.. మ‌రో హీరోగా సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించే అవ‌కాశ‌ముంద‌ని వార్త‌లు వినిపించాయి. అయితే త‌న సినిమాలో ఆర్టిస్టులెవ‌రూ ఫైన‌లైజ్ కాలేద‌ని.. అఫీషియ‌ల్‌గా చెప్పే వ‌ర‌కు కాస్త వెయిట్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

కాగా, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. త‌న గ‌త చిత్రాల‌కు మించి ఈ సినిమాని వినోదాత్మ‌కంగా తెర‌కెక్కించేందుకు అనిల్ ప్లాన్ చేశాడ‌ని స‌మాచార‌మ్‌.

More News

చార్జ్... అంటూ వస్తున్న 'కార్తీ'

'ఖాకి' సినిమా ఎలా ఉండబోతోందా? అనే సర్వత్రా ఆసక్తి మొదలైంది. ఆ ఆసక్తిని 'ఖాకి' ట్రైలర్ ఉత్కంఠగా మారుస్తోంది. ప్రతి షాట్ నూ ప్రేక్షకుడు ఊపిరి బిగబట్టి చూసేలా తెరకెక్కించిన విషయం ట్రైలర్ను చూస్తేనే అర్థమవుతోంది.

ఎప్పటికైనా దర్శకుడినవుతా - ధర్మేంద్ర కాకరాల

జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై యాంగ్రీ యంగ్ మేన్గా, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనదైన ఇమేజ్ ను సంపాదించుకున్న హీరో డా.రాజశేఖర్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం `పిఎస్ వి గరుడవేగ 126.18ఎం`.

క‌న్‌ఫ‌ర్మ్ చేసిన ర‌కుల్‌

తెలుగులో అన‌తికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది ఢిల్లీ డాళ్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌. ఇక్క‌డ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ మ‌హారాజ్ ర‌వితేజ వంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో సినిమాలు చేసింది.

పెంకి అమ్మాయిగా రెజీనా

పిల్లా నువ్వు లేని జీవితం, ప‌వ‌ర్‌, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, జో అచ్యుతానంద వంటి విజ‌యవంత‌మైన చిత్రాల్లో సంద‌డి చేసిన యువ క‌థానాయిక రెజీనా. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుపోతున్న ఈ చెన్నై చిన్న‌ది.. ప్ర‌స్తుతం నారా రోహిత్‌కి జోడీగా బాల‌కృష్ణుడు చిత్రం చేస్తోంది.

సుధీర్‌తో అదితి.. డౌట్‌లో ప‌డింది

జెంటిల్‌మాన్‌, అమీతుమీ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ని సొంతం చేసుకున్నారు ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌. ప్ర‌స్తుతం ఆయ‌న యువ క‌థానాయ‌కుడు సుధీర్‌బాబుతో ఓ సినిమా చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.