నాగ్ యాక్షన్ థ్రిల్లర్‌లో అవకాశం కొట్టేసిన అనిక సురేంద్రన్..
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ్, మలయాళ చిత్రాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన అనికా సురేంద్రన్ ఇప్పుడు తెలుగులో అద్భుతమైన అవకాశం దక్కించుకుంది. ‘క్వీన్’ వెబ్ సిరీస్ ద్వారా ఈ అమ్మడు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారైంది. ఇప్పటి వరకూ దాదాపు చైల్డ్ ఆర్టిస్టుగానే నటించిన తాజాగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌లో అవకాశం దక్కించుకుంది. ‘క్వీన్’ చూసిన తరువాత అనికను ఓ కీలక పాత్ర కోసం తీసుకోవాలని భావిస్తున్నట్టు ప్రవీణ్ సత్తారు వెల్లడించారు.
లుక్ టెస్ట్ చేసిన అనంతరం తన సినిమాలో నటించేందుకు అనిక పర్ఫెక్ట్ అని ప్రవీణ్ సత్తారు డిసైడ్ అయ్యారు. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ సెట్స్‌లో అడుగుపెట్టబోతోందని తెలుస్తోంది. తమిళ్, మలయాళంలో అనిక సాఫ్ట్ రోల్స్‌లో మాత్రమే నటించింది. నాగ్ సినిమాలో ఆమె పాత్ర ఏంటనేది ఆసక్తికరంగా మారింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఎన్నై అరింధాల్, విశ్వాసం చిత్రాల్లో బాలనటిగా అనిక సురేంద్రన్ అద్భుతంగా నటించింది. చైల్డ్ ఆర్టిస్టుగా కేరళ రాష్ట్రం నుంచి చాలా అవార్డులు అందుకుంది.
ఇపుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. అనిక మలయాళం అమ్మాయి అయినప్పటికీ అచ్చం తెలుగింటి అమ్మాయిలాగే కనిపిస్తుంది. 2007 లో ఒక మలయాళం సినిమాతో అనిక తన కెరీర్‌ను మొదలు పెట్టింది. 2015 లో తమిళ్ స్టార్ అజిత్ హీరోగా, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఎంతవాడుకాని సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మళ్ళీ అజిత్ తోనే విశ్వాసం సినిమాలో నటించిన అనిక సురేంద్రన్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. వరుసగా ఆఫర్లు వచ్చిపడ్డాయి. తాజాగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు అనిక సిద్ధమవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com