ఆగస్ట్ 7న ఏంజెల్ ట్రైలర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై నాగాఅన్వేష్, హెబ్బాపటేల్ జంటగా నటించిన చిత్రం 'ఏంజెల్'. సోషియోఫాంటసీ స్టోరీతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు రాజమౌళి శిష్యుడు, నూతన దర్శకుడు బాహుబలి పళని. దాదాపు 40 నిమషాలకి పైగా గ్రాఫిక్స్ హంగులతో రెడీ అవుతున్న ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోకి విడుదల చేస్తున్నట్లుగా చిత్ర బృందం ఇది వరకే ప్రకటిచింది.
ఈ నేపథ్యంలో ఆగస్ట్ 7న ఏంజెల్ థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత భువన్ సాగర్ తెలిపారు. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటాయని, తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉందని దర్శకుడు పళని తెలిపారు. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ లో బిజీగా ఉన్న ఈ సినిమాను అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నట్లుగా దర్శకనిర్మాతలు ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments