డబ్బింగ్ మొదలుపెట్టిన 'ఏంజెల్'
Send us your feedback to audioarticles@vaarta.com
బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ టైటిల్ రోల్ లో తెరకెక్కుతోన్న సినిమా “ఏంజిల్”. యంగ్ హీరో నాగ అన్వేష్, ఓ ఛాలెజింగ్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంతో దర్శకధీరుడు రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకుడిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. ఒక పాట మినహా ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొంది. ఈ నేపథ్యంలో నిర్మాత భువన్ సాగర్ మాట్లాడుతూ డబ్బింగ్ వర్క్ దాదాపుగా కంప్లీట్ అయిందని త్వరలో మిగతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి మే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
గతేడాది శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ లో విడుదలైన సూపర్ హిట్ మూవీ "మన్యంపులి" తరహాలోనే 30 నిమషాలకు పైగా గ్రాఫిక్స్ హంగులతో "ఏంజెల్" రూపుదిద్దుకుంటోంది. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సుమన్,సప్తగిరి, ప్రదీప్ రావత్, షియాజీ షిండే, కబీర్ సింగ్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, రామరాజు, ఛమ్మక్ చంద్ర, సన తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి స్టంట్స్ జాషువా ఫైట్ మాస్టర్, కాగా ప్రముఖ బాలీవుడ్ స్టంట్ మాస్టర్ రవివర్మ పతాక సన్నివేశాల ను ప్రత్యేకంగా రూపొందించారు.
బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సెస్సరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందించగా టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ అండ్ జానీ మాస్టర్లు వినూత్నమైన నృత్యాలు కంపోజ్ చేశారని, కోలీవుడ్ ఫేమ్ గుణ డి.ఎఫ్.టి చిత్రీకరించిన విజువల్స్ అద్బుతమని ఈ చిత్ర బృందం తెలిపింది. భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత శ్రీ సింధూరపువ్వు కృష్ణారెడ్డి పర్యవేక్షణలో సోషియోఫాంటసీ ఎంటర్ టైనర్ గా ఏంజెల్ మే నెలలో ప్రేక్షకులను కనువిందు చేయబోతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments