తెలుగుదేశం పార్టీ నేతలకు షాక్ ఇచ్చిన అంగన్‌వాడీలు

  • IndiaGlitz, [Saturday,January 13 2024]

కొద్ది రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం వారి డిమాండ్స్ పట్ల సానుకూలంగా ఉంది. మూడు దఫాలు అంగన్‌వాడీలను చర్చలకు పిలిచింది. ఈ చర్చల్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి ప్రభుత్వ పెద్దలు పాల్గొన్నారు. వారితో సుదీర్ఘంగా చర్చించి మీ డిమాండ్స్‌ను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో సీఎం జగన్ మాట మేరకు మేరకు అన్ని హామీలు నెరవేర్చారని తెలిపారు. అధికారంలోకి రాగానే జీతాలు పెంచడంతో పాటు అనేక సదుపాయాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.

డిమాండ్స్ పట్ల ప్రభుత్వం సానుకూలం..

వారు డిమాండ్ చేసిన వాటిలో ఒక్క జీతాల అంశమే పెండింగ్‌లో ఉంది. అది కూడా వచ్చే జూలైలో జీతాలు పెంచుతామని చెప్పారు. అలాగే అంగన్‌వాడీల టీఏ, డీఏలు కూడా ఫిక్స్‌ చేస్తున్నామని.. టీచర్లకు రిటైర్డ్ అయ్యాక బెనిఫిట్లు రూ.1.50లక్షలకు.. హెల్పర్లకు రూ.50వేలు పెంచుతామని హామీ ఇచ్చారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని పదే పేద విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ఈ సమ్మె వెనుక పక్కా రాజకీయ కుట్ర ఉందని వారిని హెచ్చరిస్తున్నారు. గర్భిణీలు, పసి బిడ్డలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వారిపై ఎస్మా ప్రయోగించామని క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం మాట విని వెంటనే అంగన్‌వాడీలు విధుల్లో చేరాలని కోరుతున్నారు.

పారిపోయిన టీడీపీ నేతలు..

ప్రభుత్వ పెద్దలు అన్నట్లుగానే ఇందులో రాజకీయ నాయకులు తలదూర్చే ప్రయత్నం చేస్తున్నారు. అమలాపురంలో ధర్నా చేస్తున్న అంగన్‌వాడీల దగ్గరకు తెలుగుదేశం పార్టీకి చెందిన టీఎన్టీయూసీ నాయకులు సంఘీభావం తెలిపేందుకు వచ్చాయి. అయితే వారికీ అంగన్‌వాడీలు షాక్ ఇచ్చారు. మీ మద్దతు అవరసం లేదని ముఖం మీద తేల్చిచెప్పారు. గతంలో అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించిన ఘనత టీడీపీదే అంటూ తిరగబడ్డారు. దీంతో ఒక్కసారిగా నివ్వెరపోయిన పసుపు నేతలు 20 ఏళ్ల సంగతి ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నారంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినా కానీ మీ పార్టీ మద్దతు అవసరం లేదని కరాఖండీగా చెప్పడంతో బిక్కమొహంతో చేసేదేమీ లేక వెనుదిరిగి పారిపోయారు.

More News

Chandrababu: సీఐడీ కార్యాలయాలకు వెళ్లిన చంద్రబాబు.. మళ్లీ ఎందుకంటే..?

టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో పర్యటించారు. హైదరాబాద్‌ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన.. నేరుగా విజయవాడ తులసీనగర్‌లో ఉన్న సీఐడీ కార్యాలయానికి వెళ్లారు.

Pandem Kollu: కాలు దువ్వుతున్న పందెంకోళ్లు.. చేతులు మారనున్న కోట్ల రూపాయలు..

సంక్రాంతి అంటేనే గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు, పిండి వంటలు, ముగ్గులు, గొబెమ్మలు. ఇవే కాకుండా ముందుగా వినపడేది కోడిపందాలు.

First Day Collections: 'గుంటూరుకారం' వర్సెస్ 'హనుమాన్'.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే..?

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు(Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన 'గుంటూరు కారం'బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మహేష్ వన్ మ్యాన్‌ షోతో అలరిస్తున్నాడు.

YS Sharmila: చంద్రబాబును కలిసిన షర్మిల.. కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వానం..

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)ను కాంగ్రెస్ నాయకురాలు వైయస్ షర్మిల(YS Sharmila) కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన షర్మిల తన కుమారుడి వివాహానికి హాజరుకావాలని కోరుతూ చంద్రబాబు

Ram Charan-Upasana: రామ్‌చరణ్‌ దంపతులకు అయోధ్య నుంచి ఆహ్వానం

యావత్ ప్రపంచం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం మరో పది రోజుల్లో జరగనుంది. ఈ వేడుక కోసం అయోధ్య అందంగా ముస్తాబవుతోంది.