Anganwadis: సమ్మె ఉధృతం చేసిన అంగన్వాడీలు.. నేటి నుంచి నిరవధిక దీక్షలు..
Send us your feedback to audioarticles@vaarta.com
రోజురోజుకు ప్రభుత్వంపై అంగన్వాడీలు పోరును ఉధృతం చేస్తున్నారు. తమ డిమాండ్స్ మొత్తం నెరవేరే వరకు సమ్మెను ఆపేది లేదని భీష్మించుకున్నారు. పండుగ సెలవులు కూడా లేకుండా ధర్నాలు చేస్తున్నారు. రోడ్ల పైనే పిండి వంటలు చేశారు. అయినా ప్రభుత్వం దిగి రాకపోవడంతో నేటి నుంచి నిరవధిక దీక్షలకు దిగారు. విజయవాడలోని ధర్నా చౌక్‌లో అంగన్వాడీ సంఘ జేఏసీ నేతలంతా కలిసి దీక్షలు చేస్తున్నారు. మిగతా జిల్లాల్లో, మండలాల్లోనూ నేతలు నిరసన దీక్షల్లో పాల్గొన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వ తీర్చకుండా మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు.
పాదయాత్ర సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని గతేడాది డిసెంబర్ 12 నుంచి అంగన్వాడీలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వం పలు దఫాలు చర్చలు కూడా జరిపింది. ఈ చర్చల్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి ప్రభుత్వ పెద్దలు పాల్గొన్నారు. వారితో సుదీర్ఘంగా చర్చించి మీ డిమాండ్స్‌ను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో సీఎం జగన్ మాట మేరకు మేరకు అన్ని హామీలు నెరవేర్చారని తెలిపారు. అధికారంలోకి రాగానే జీతాలు పెంచడంతో పాటు అనేక సదుపాయాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.
అయితే వారు డిమాండ్ చేసిన వాటిలో ఒక్క జీతాల పెంపు అంశమే పెండింగ్‌లో ఉంది. అది కూడా వచ్చే జూలైలో జీతాలు పెంచుతామని చెప్పారు. అలాగే అంగన్వాడీల టీఏ, డీఏలు కూడా ఫిక్స్ చేస్తున్నామని.. టీచర్లకు రిటైర్డ్ అయ్యాక బెనిఫిట్లు రూ.1.50లక్షలకు.. హెల్పర్లకు రూ.50వేలు పెంచుతామని హామీ ఇచ్చారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని పదే పేద విజ్ఞప్తి చేస్తున్నారు. గర్భిణీలు, పసి బిడ్డలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వారిపై ఎస్మా ప్రయోగించామని క్లారిటీ ఇచ్చారు. అయితే అంగన్వాడీలు మాత్రం సమ్మెను మరింత తీవ్రం చేస్తూ నిరవిధక దీక్షలకు దిగారు.
ప్రభుత్వంపై నమ్మకం ఉంచి సమ్మె విరమించాలని అంగన్వాడీలను మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి కోరారు. సమ్మె కాలంలో జీతాలు కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పది హామీలకు ప్రభుత్వం ఓకే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో జీతాలు పెంచడం సరికాదని.. జులై నుంచి జీతాలు పెంచుతామని తెలిపారు. గర్భిణీలు, బాలింతలను దృష్టిలో పెట్టుకుని పెద్ద మనసుతో సమ్మె విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout