Anganwadis: సమ్మె ఉధృతం చేసిన అంగన్‌వాడీలు.. నేటి నుంచి నిరవధిక దీక్షలు..

  • IndiaGlitz, [Wednesday,January 17 2024]

రోజురోజుకు ప్రభుత్వంపై అంగన్‌వాడీలు పోరును ఉధృతం చేస్తున్నారు. తమ డిమాండ్స్ మొత్తం నెరవేరే వరకు సమ్మెను ఆపేది లేదని భీష్మించుకున్నారు. పండుగ సెలవులు కూడా లేకుండా ధర్నాలు చేస్తున్నారు. రోడ్ల పైనే పిండి వంటలు చేశారు. అయినా ప్రభుత్వం దిగి రాకపోవడంతో నేటి నుంచి నిరవధిక దీక్షలకు దిగారు. విజయవాడలోని ధర్నా చౌక్‌లో అంగన్వాడీ సంఘ జేఏసీ నేతలంతా కలిసి దీక్షలు చేస్తున్నారు. మిగతా జిల్లాల్లో, మండలాల్లోనూ నేతలు నిరసన దీక్షల్లో పాల్గొన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వ తీర్చకుండా మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు.

పాదయాత్ర సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని గతేడాది డిసెంబర్‌ 12 నుంచి అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వం పలు దఫాలు చర్చలు కూడా జరిపింది. ఈ చర్చల్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి ప్రభుత్వ పెద్దలు పాల్గొన్నారు. వారితో సుదీర్ఘంగా చర్చించి మీ డిమాండ్స్‌ను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో సీఎం జగన్ మాట మేరకు మేరకు అన్ని హామీలు నెరవేర్చారని తెలిపారు. అధికారంలోకి రాగానే జీతాలు పెంచడంతో పాటు అనేక సదుపాయాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.

అయితే వారు డిమాండ్ చేసిన వాటిలో ఒక్క జీతాల పెంపు అంశమే పెండింగ్‌లో ఉంది. అది కూడా వచ్చే జూలైలో జీతాలు పెంచుతామని చెప్పారు. అలాగే అంగన్‌వాడీల టీఏ, డీఏలు కూడా ఫిక్స్‌ చేస్తున్నామని.. టీచర్లకు రిటైర్డ్ అయ్యాక బెనిఫిట్లు రూ.1.50లక్షలకు.. హెల్పర్లకు రూ.50వేలు పెంచుతామని హామీ ఇచ్చారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని పదే పేద విజ్ఞప్తి చేస్తున్నారు. గర్భిణీలు, పసి బిడ్డలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వారిపై ఎస్మా ప్రయోగించామని క్లారిటీ ఇచ్చారు. అయితే అంగన్‌వాడీలు మాత్రం సమ్మెను మరింత తీవ్రం చేస్తూ నిరవిధక దీక్షలకు దిగారు.

ప్రభుత్వంపై నమ్మకం ఉంచి సమ్మె విరమించాలని అంగన్‌వాడీలను మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి కోరారు. సమ్మె కాలంలో జీతాలు కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పది హామీలకు ప్రభుత్వం ఓకే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో జీతాలు పెంచడం సరికాదని.. జులై నుంచి జీతాలు పెంచుతామని తెలిపారు. గర్భిణీలు, బాలింతలను దృష్టిలో పెట్టుకుని పెద్ద మనసుతో సమ్మె విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

More News

క్వాష్ పిటిషన్‌పై చంద్రబాబుకు సుప్రీంకోర్టులో దక్కని రిలీఫ్

స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ద్విసభ్య ధర్మాసనం భిన్నమైన తీర్పును ఇచ్చింది.

Mahesh Babu: ఇదే నా చివరి తెలుగు సినిమా.. అవి నిజమైన బీడీలు కావు: మహేష్

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు నటించిన ‘గుంటూరు కారం’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్లలో అభిమానులను అలరిస్తోంది. మూవీలో మహేష్ డ్యాన్స్, నటన, స్వాగ్, స్లాంగ్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఖరారు.. ఎవరు ఎంపిక అయ్యారంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను అధిష్టానం ఖరారు చేసింది. ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను ప్రకటించింది. ఈ మేరకు వారిద్దరికీ ఫోన్ చేసి నామినేషన్

Sankranthi Posters; సంక్రాంతి పోస్టర్లు తీసుకొచ్చిన హీరోలు.. ఫ్యాన్స్‌కు డబుల్ పండుగ..

సంక్రాంతి శోభతో తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. పల్లెటూర్లు పండుగ కళ సంతరించుకున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా పండుగ వేడుకలు చేసుకుంటున్నారు.

PM Modi: లేపాక్షి ఆలయంలో ప్రధాని మోదీ పూజలు.. మూలవిరాట్‌కు స్వయంగా హారతి..

ప్రధాని మోదీ దక్షిణాది పర్యటనకు వచ్చారు. పర్యటనలో భాగంగా ముందుగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.