బిగ్‌బాస్ 5 తెలుగు: నేను మనిషినా, పశువునా.. యానీ మాస్టర్ ఆగ్రహం, హౌస్మేట్స్ ధర్నా
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 5 తెలుగులో ఈ రోజు ఎపిసోడ్ ఫన్నీగా సాగింది. ముఖ్యంగా కెప్టెన్సీ పోటీదారుల కోసం నిర్వహించని బీబీ హోటల్ టాస్క్ ఈ రోజు కూడా సాగింది. దొరికిందే సందు అన్నట్లుగా షణ్ముఖ్‌కి సిరి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఇదే సమయంలో రవికి బిగ్‌బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ఏంటో ఇంటి సభ్యులకు తెలిసిపోయింది. దీంతో అతని నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది. మరి ఇంటి సభ్యులు రవిని ఎలా పట్టుకున్నారో..? సీక్రెట్ రూమ్‌లో వున్న జెస్సీ పరిస్ధితి ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ రోజు ఎపిసోడ్ గురించి చదివేయాల్సిందే.
కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్‌బాస్ ఇచ్చిన 'బీబీ హోటల్' టాస్క్ నడుస్తోంది. సీజన్ 5లో ఇంతటి వినోదాన్ని పంచింది.. సరదాగా సాగుతున్న టాస్క్ ఏదైనా ఉంది అంటే ఇదొక్కటే. సీజన్ మొదలైన నాటి నుంచి ప్రతిసారి ఏ టాస్క్ ఇచ్చినా శత్రువుల్లా కొట్టుకునే ఇంటి సభ్యులకు ఈ టాస్క్‌లో మాత్రం ఛాన్స్ లేదు. ఇక్కడ ఎదుటివారిని ఇంప్రెస్ చేసి డబ్బులు సంపాదించాలి.
మేనేజర్‌గా , రిసెప్షనిస్ట్‌గా యానీమాస్టర్, వెయిటర్స్ అండ్ చెఫ్స్ గా షణ్ముక్, శ్రీరామ్ చంద్ర, ఉద్యోగాన్ని కాపాడుకునే హౌస్ కీపింగ్ స్టాఫ్‌గా రవి, హనీమూన్ కపుల్ గా మానస్- ప్రియాంక, ఫస్ట్ టైం ఫైవ్ స్టార్ హోటల్లో అడుగుపెట్టిన వ్యక్తిగా సన్నీ , డాన్ కూతురుగా సిరి, హౌటల్ ఓనర్ ఫ్రెండ్ గా కాజల్ ఎవరికి వారే చెలరేగిపోతున్నారు. అందరికన్నా ఈ టాస్క్‌లో బాగా పర్ఫామెన్స్ ఇచ్చి ఎక్కువ మార్కులు కొట్టేసింది మాత్రం సన్నీ అనే చెప్పాలి. టాస్క్ ముగిసేసరికి ఎవరి వద్ద ఎక్కువ డబ్బులు ఉంటాయో వారే విజేతలుగా నిలుస్తారు. అయితే సీక్రెట్ టాస్క్‌లో భాగంగా హోటల్ సిబ్బంది నుంచి డబ్బులు కొట్టేయడంలో రవి సక్సెస్ అయ్యాడు.
హనీమూన్ కోసం వచ్చిన కొత్త జంట ప్రియాంక- మానస్‌ల కోసం యానీ మాస్టర్ పూలతో బెడ్ని అందంగా అలంకరించింది. మీ ఫస్ట నైట్ కోసం అంతా రెడీ అని చెప్తుండగా సన్నీ వెళ్లి ఆ బెడ్‌మీద పడి అటు తిరిగి ఇటు తిరిగి దానిని నాశనం చేశాడు. ఇదే సమయంలో నువ్వు దొంగతనం చేసిన సంగతి తనకు తెలుసంటూ రవితో చెప్పాడు షణ్ముఖ్. దొరికిపోయినప్పటికీ రవి మాత్రం తాను తీయలేదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కాజల్ వాటర్ బాటిల్లో కారం పోసింది కూడా రవేనన్న సంగతిని పసిగట్టేశారు. అతడికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారని, ఇక నుంచి రవికి డబ్బులు ఇవ్వకూడదని అంతా ఓ నిర్ణయానికి వచ్చారు.
ఇప్పటికే పింకీ-మానస్‌ల ఫస్ట్ నైట్ బెడ్ని నాశననం చేసిన సన్నీ.. క్యాండిల్ లైట్ డిన్నర్‌ను కూడా లేకుండా చేశాడు. దీంతో పింకీ అలగడంతో ఆమెను బుజ్జగించాడు మానస్. తన డబ్బులు కొట్టేశారని రగిలిపోతున్న కాజల్ ఎలాగైనా సంపాదించుకోవాలని భావించింది. దీనిలో భాగంగా రిసెప్షనిస్ట్ యానీ బ్యాగులో నుంచి డబ్బులు దొంగిలించింది. అప్పటికే రవి గురించి తెలిసిపోవడంతో ఈ పని చేసింది అతనేనని ఫిక్స్ అయ్యారు. నాతో చాకిరీ చేయించుకుని టిప్పు తక్కువగా ఇస్తున్నారని అసహనానికి లోనైన యానీ నేను మనిషినా? పశువునా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
మొత్తం మీద శ్రీరామ్, షణ్ముక్, యానీ మాస్టర్ లాస్ అయినట్టు తెలుస్తోంది. దీంతో హోటల్ స్టాఫ్ మొత్తం ధర్నాకు దిగాలని నిర్ణయించుకుంటారు. 10 వేలు ఇచ్చే వరకు కస్టమర్లకు ఎలాంటి సేవలు చేయకూడదని .. కనీసం ఫుడ్ కూడా కుక్ చేయకూడదని డిసైడ్ అవుతారు. దీంతో కస్టమర్లు దిగిరాక తప్పలేదు. ఇక అనారోగ్యంతో సీక్రెట్ రూమ్‌లో ఉన్న జెస్సీకి అనారోగ్యం మళ్లీ తిరగబడినట్లుగా కనిపిస్తోంది. దీంతో అతడిని చెకప్ చేసేందుకు డాక్టర్ వస్తారు. పరీక్షల తర్వాత నీకు మంచి వైద్యం అవరసరమని.. అందుకు తగ్గట్టు మంచి ట్రీట్మెంట్ ఇస్తామని, ధైర్యంగా ఉండమని జెస్సీకి హామీ ఇచ్చాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments