ఆండ్రియా 'మహల్'
Send us your feedback to audioarticles@vaarta.com
ఆండ్రియా జెరీమియా పేరు తెలుగువారికి కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో పలు పాటలు పాడిన ఆమె, ర్యాప్ సింగర్‌గానూ, రైటర్‌గానూ సుపరిచితురాలే. ఆ తర్వాత ఆమె నటించిన పలు సినిమాలు తెలుగులో విడుదలయ్యాయి. కమల్‌హాసన్ నటించిన 'విశ్వరూపం', విశాల్ నటించిన 'డిటెక్టివ్' ఇటీవల కాలంలో తెలుగులో విడుదలైన ఆండ్రియా సినిమాలు.
తాజాగా ఆమె పలు తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటే 'మాళిగై'. ఈ సినిమాను కన్నడ దర్శకుడు 'దిల్' సత్య తెరకెక్కిస్తున్నారు. ఫాంటసీ మిళితమైన హారర్, యాక్షన్ చిత్రమిది ఇందులో ఆండ్రియా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒక పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గానూ, మరో పాత్రలో యువరాణిగానూ నటిస్తున్నారు.
ఇన్వెస్టిగేషన్ కోసం ఓ మహల్లో ఎంటర్ అయిన పోలీస్ ఆఫీసర్‌కి తన గతం గుర్తొచ్చే సినిమా ఇది. కార్తిక్ జయరామన్, కె.ఎస్.రవికుమార్, మనోబాలా, అశుతోష్ రానా, మధుమిత, అలీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగులో 'మహల్' అనే పేరు పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా మహిళా ప్రాధాన్యం గల సినిమా మరొక్కటి తెరకెక్కుతుందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout