భయపడుతున్నానంటున్న హీరోయిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్ ఆండ్రియాకు సినిమా అంటే భయం వచ్చిందట. అందుకు కారణం సినిమాలే. ఇప్పుడు ఆండ్రియా నటిస్తున్న సినిమా `గృహం`. సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను నవంబర్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
తమిళలో అవళ్, హిందీలో ది హౌస్ నెక్ట్స్ డోర్ పేరుతో సినిమా విడుదల కానుంది. హారర్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో నటించడానికే తాను భయపడ్డానని, కేవలం నటించడానికే కాదు, ఇప్పుడు సినిమా చూడాలన్నా ఎంతో భయంగా ఉందని అంటుంది ఆండ్రియా.
వయాకామ్ మోషన్ పిక్చర్స్, ఇటాకీ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్స్‌తో పాటు సిద్ధార్థ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సిద్ధార్థ్ న్యూరో సర్జన్ డాక్టర్‌పాత్రలో నటిస్తున్నాడట. దాదాపు నాలుగేళ్ల తర్వాత సిద్ధార్థ్ తెలుగులో చేయనున్న సినిమా ఇది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments