టాలీవుడ్ కు రిలీఫ్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం.. కానీ ఆ మతలబు ఏంటో..
Send us your feedback to audioarticles@vaarta.com
సెకండ్ వేవ్ కరోనా ప్రభావం తగ్గుతున్న సమయంలో థియేటర్స్ రీఓపెన్ గురించి టాలీవుడ్ లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. చాలా మంది నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులతో తమ చిత్రాలని ఓటిటీలకు అమ్మేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా థియేటర్స్ పునఃప్రారంభం, టికెట్ల ధరపై టాలీవుడ్ లో జోరుగా చర్చ జరుగుతోంది.
వకీల్ సాబ్ చిత్ర రిలీజ్ కు ముందు ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరపై నియంత్రణ విధించిన సంగతి తెలిసిందే. దీనితో వకీల్ సాబ్ చిత్రాన్ని తక్కువ ధరకే ప్రదర్శించారు. ఈ అంశంలో టాలీవుడ్ మొత్తం కలవరపాటుకు గురైంది. అన్ని చిత్రాలకు ఇదే టికెట్ ధరలు కొనసాగితే నిర్మాత, బయ్యర్లు నష్టపోవడం ఖాయం అనే టాక్ వినిపించింది.
ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ కు గుడ్ న్యూస్ తెలియజేసింది. టికెట్ ధరల విషయంలో తాజాగా మరో జీవో జారీ చేసింది. ఇక సినిమాలకు బయ్యర్లు, ఎగ్జిబిటర్లు టికెట్ ధరలు నిర్ణయించుకునే వెసులుబాటు కల్పిస్తూ తాజాగా జీవో జారీ చేసింది.
దీనితో పెద్ద చిత్రాలకు గతంలో మాదిరిగా బయ్యర్లు తొలి వారంలో టికెట్ ధరలు పెంచుకునే వీలుంటుంది. కానీ జీవోలో ఏపీ ప్రభుత్వం ఊహించని విధంగా పెట్టిన మెలికపై చర్చ జరుగుతోంది. ఎప్పటికప్పుడు టికెట్ ధరల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది.
అంటే టాలీవుడ్ చిత్రాల టికెట్ ధరలు ఏపీలో పూర్తిగా ప్రభుత్వం కంట్రోల్ లో ఉండనున్నాయి. ఎప్పటికప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని టికెట్ ధరలు పెంచడం లేదా తగ్గించడం చేసే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా తెలంగాణలో ఇప్పటికే 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ లో సినిమాలు విడుదల చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏపీలో ఇప్పటికైతే 50 శాతం ఆక్యుపెన్సీకే అనుమతి ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout