స్పీకర్ తమ్మినేని దంపతులకు సీరియస్!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా సెకండ్ వేవ్ ఊహకందని రీతిలో వ్యాపిస్తోంది. రోజుకు దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా.. మరోవైపు రాష్ట్రాల్లో వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇక ఏపీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య దారుణంగా ఉంది. కాగా.. ప్రముఖ రాజకీయ నాయకులు సైతం కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు కరోనా బారిన పడ్డారు. వారం రోజుల కిందట తమ్మినేని సతీమణి వాణిశ్రీ కరోనాతో శ్రీకాకుళంలోని మెడికవర్ ఆస్పత్రిలో చేరారు.
Also Read: ఈ మొక్కలు ఇంట్లో ఉన్నాయంటే.. ఆక్సిజన్‌కు కొదవుండదు..
నాలుగు రోజుల కిందట స్పీకర్ కూడా కరోనా లక్షణాలతో ఇదే ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వీరిద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉంది. స్పీకర్ దంపతులకు మెరుగైన చికిత్సను అందిస్తున్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా.. ఏపీ కొత్తగా 18,972 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. 71 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 1,15,275 మందికి కరోనా పరీక్ష నిర్వహించగా.. 16.46 శాతం మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 24 గంట వ్యవధిలో కర్నూలు జిల్లాలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఆ జిల్లాలో 2,628 కేసులు నమోదవగా.. 1960 కేసులతో విశాఖ రెండో స్థానంలో ఉంది. 24 గంటల వ్యవధిలో తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఏడుగురు చొప్పున, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, గుంటూరు జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments