ఏపీ కరోనా బులిటెన్ విడుదల.. కొత్తగా..

  • IndiaGlitz, [Friday,June 26 2020]

ఏపీ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 22వేల 305 శాంపిల్స్‌ని పరీక్షించగా 605 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 34 మంది ఉండగా.. ఇతర దేశాల నుంచి వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మిగిలిన 570 మంది ఏపీకి చెందినవారే కావడం గమనార్హం.

నేడు 191 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కారణంగా కర్నూలు, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందగా.. గుంటూరు, విశాఖలో ఒక్కరు చొప్పున మరణించారు. నేటి వరకూ 7 లక్షల 91 వేల 624 శాంపిల్స్‌ని పరీక్షించగా ఏపీలో 9353 పాజిటివ్ కేసులు.. ఇతర రాష్ట్రాల వారికి 1764, ఇతర దేశాల నుంచి వచ్చిన 372 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11వేల 489కి చేరుకుంది.

More News

ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి కరోనా పాజిటివ్ విషయమై ఏపీ ఆరోగ్యశాఖ వివరణ

టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి కరోనా వివాదంపై ఆరోగ్యశాఖ వివరణ ఇచ్చింది. ఆర్టీపీసీఆర్‌లో కచ్చితత్వం 67 శాతమేనని పేర్కొంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ నడిపేందుకు యత్నించి కింద పడిపోయిన ‘జెర్సీ’ హీరోయిన్

‘జెర్సీ’ సినిమా ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన ముద్దుగుమ్మ శ్రద్ధా శ్రీనాథ్. ఈ అమ్మడు 2017లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను ఇన్‌స్టాగ్రాం వేదికగా అభిమానులతో పంచుకుంది.

లోక్‌సభ స్పీకర్, హోంశాఖ సెక్రటరీని కలవనున్న రఘురామ కృష్ణంరాజు

ఏపీలో గత కొద్ది రోజులుగా అనూహ్య పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తమ పార్టీ నేతలపైనే కయ్యానికి కాలు దువ్వారు.

తెలంగాణలో 11 వేలు దాటిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా కేసులు 11 వేలు దాటాయి.

అందుకే కరోనా పరీక్షలు నిలిపివేశాం: ఆరోగ్యశాఖ డైరెక్టర్

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో 50 వేల కరోనా పరీక్షలు నిర్వహించాలని భావించామని..