ఏపీ కరోనా బులిటెన్ విడుదల.. కొత్తగా..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 22వేల 305 శాంపిల్స్‌ని పరీక్షించగా 605 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 34 మంది ఉండగా.. ఇతర దేశాల నుంచి వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మిగిలిన 570 మంది ఏపీకి చెందినవారే కావడం గమనార్హం.
నేడు 191 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కారణంగా కర్నూలు, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందగా.. గుంటూరు, విశాఖలో ఒక్కరు చొప్పున మరణించారు. నేటి వరకూ 7 లక్షల 91 వేల 624 శాంపిల్స్‌ని పరీక్షించగా ఏపీలో 9353 పాజిటివ్ కేసులు.. ఇతర రాష్ట్రాల వారికి 1764, ఇతర దేశాల నుంచి వచ్చిన 372 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11వేల 489కి చేరుకుంది.
#COVIDUpdates: As on 26th June, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) June 26, 2020
COVID Positives: 9353
Discharged: 4021
Deceased: 146
Active Cases: 5186#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/aIRLyyvqyN
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout