ఆంగ్ల మాధ్యమం: జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రాజకీయాలు అస్సలు ఆగట్లేదు. అధికార పార్టీ మాత్రం దీన్నే అలుసుగా చేసుకుని చేయాల్సినవన్నీ చేసేద్దామని భావిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం అస్తమాను దాన్ని రాజకీయం చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో మరోసారి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై పంచాయతీ హైకోర్టుకు చేరింది. ఈ క్రమంలో జగన్ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం రద్దు చేసినట్లు కీలక ప్రకటన చేసింది. అంతేకాదు.. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.81,85ను రద్దు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
ఇదిలా ఉంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఇప్పటికే జగన్ సర్కార్ ఉత్తరవ్వులు జారీ చేసింది. ఈ జీవోలను సవాల్ చేస్తూ బీజేపీ నేత సుదీష్ రాంబొట్ల, గుంటుపల్లి శ్రీనివాస్ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో అసలు ఏ మాధ్యమంలో చదవాలన్న అంశం విద్యార్థుల నిర్ణయానికే వదిలివేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టులో వాదించడం జరిగింది. అంతేకాదు.. ఆంగ్లమాధ్యమాన్ని తప్పనిసరి చేయడం సరికాదని కూడా పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఆంగ్లమాధ్యమం అనేది విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇలా ఇరు వర్గాల వాదనలను సుమారు గంటపాటు విన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఆ తీర్పును ఇవాళ అనగా బుధవారం నాడు వెల్లడించింది. జీవోలను రద్దు చేస్తూ ఇవాళ హైకోర్టు తీర్పునిచ్చింది. అంటే ఏపీ సర్కార్ తీసుకున్న కీలక నిర్ణయాకి ఈ తీర్పుతో కోలుకోని షాక్ తగిలిందని నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments