ఆంగ్ల మాధ్యమం: జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రాజకీయాలు అస్సలు ఆగట్లేదు. అధికార పార్టీ మాత్రం దీన్నే అలుసుగా చేసుకుని చేయాల్సినవన్నీ చేసేద్దామని భావిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం అస్తమాను దాన్ని రాజకీయం చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో మరోసారి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై పంచాయతీ హైకోర్టుకు చేరింది. ఈ క్రమంలో జగన్ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం రద్దు చేసినట్లు కీలక ప్రకటన చేసింది. అంతేకాదు.. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.81,85ను రద్దు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

ఇదిలా ఉంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఇప్పటికే జగన్ సర్కార్ ఉత్తరవ్వులు జారీ చేసింది. ఈ జీవోలను సవాల్‌ చేస్తూ బీజేపీ నేత సుదీష్‌ రాంబొట్ల, గుంటుపల్లి శ్రీనివాస్‌ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో అసలు ఏ మాధ్యమంలో చదవాలన్న అంశం విద్యార్థుల నిర్ణయానికే వదిలివేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టులో వాదించడం జరిగింది. అంతేకాదు.. ఆంగ్లమాధ్యమాన్ని తప్పనిసరి చేయడం సరికాదని కూడా పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఆంగ్లమాధ్యమం అనేది విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇలా ఇరు వర్గాల వాదనలను సుమారు గంటపాటు విన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఆ తీర్పును ఇవాళ అనగా బుధవారం నాడు వెల్లడించింది. జీవోలను రద్దు చేస్తూ ఇవాళ హైకోర్టు తీర్పునిచ్చింది. అంటే ఏపీ సర్కార్ తీసుకున్న కీలక నిర్ణయాకి ఈ తీర్పుతో కోలుకోని షాక్ తగిలిందని నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

More News

మే-03 వరకు ఇవన్నీ పాటించాల్సిందే.. కేంద్రం హెచ్చరిక

కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో మే-03 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసిన విషయం విదితమే.

మూడోసారి అదే మ్యూజిక్ డైరెక్టర్‌తో నాని

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. త‌న 25వ సినిమా `వి` ఉగాది సంద‌ర్భంగా విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా ప్ర‌భావంతో విడుద‌ల కాలేదు.

రీమేక్‌లో ర‌వితేజ‌?

ఈ మ‌ధ్య ర‌వితేజ జ‌యాప‌జ‌యాల‌కు సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌కు ఓకే చెప్పేస్తున్నాడు. వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నాడు. ఇప్పుడు ర‌వితేజ హీరోగా గోపీచంద్

బన్నీ హీరోయిన్ పరిస్థితేంటి..? ఇలా త‌యారైంది

నానితో మ‌జ్ను సినిమాలో జ‌త క‌ట్టిన మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్ ప్రారంభంలో మంచి అవ‌కాశాల‌నే అందిపుచ్చుకుంది.

"ఆదిత్యా థాక్రే.. సిగ్గుగా అనిపించట్లేదా..!?"

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో భారత దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉంటున్న వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ప్రధాని మోదీ లాక్‌డౌన్ కీలక ప్రకటన చేస్తారని..