చిన్న సినిమాలకు ఆంధ్ర ప్రదేశ్ రాయితీలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ ఫిలిమ్ డెవలప్ మెంట్ ఛైర్మన్ అంబికా కృష్ణ సినిమాల నిర్మాణానికి సంబంధించి కొన్ని రాయితీలు ప్రకటించారు. నాలుగు కోట్ల లోపు నిర్మించే చిత్రాలకు నగదు, పన్ను రాయితీలతో పాటు.. వాటిని చిన్న సినిమాలుగా గుర్తించి పన్నును వెనక్కి ఇచ్చేస్తాం. 18 శాతం జి.ఎస్.టిలో 9 శాతం రద్దు చేసి తిరిగి చెల్లిస్తుందని తెలిపారు. సినిమాలకు ఎఫ్.డి.సి ద్వారా సింగిల్ విండో అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటాం.
డబ్బింగ్, రీరికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ఏపీలోనే పూర్తి చేయాలని అన్నారు. ఉత్తమ కథాంశం ఉన్న చిత్రాల్లో 15 చిత్రాలకు 10 లక్షల రూపాయల నగదును కేటాయిస్తాం. భారీ ఎత్తున రిలీజ్ అయ్యే డబ్బింగ్ సినిమాల వల్ల తెలుగు సినిమాలకు థియేటర్స్ దొరకడం లేదు. దీనిపై కూడా చర్యలు తీసుకునేలా ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు అంబికా కృష్ణ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments