రఘురామ అరెస్ట్.. ఏ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారంటే..

కొన్ని నెలలుగా వైసీపీకి, ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వంతో పాటు, అధిష్టానం, మంత్రులు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ రఘురామ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు సైతం రఘురామపై విమర్శల బాణాలు సంధిస్తూనే ఉన్నారు. సడెన్‌గా సీన్‌లోకి నటి శ్రీరెడ్డి ఎంట్రీ ఇచ్చి రఘురామపై మాటల్లో చెప్పలేని దూషణలతో రెచ్చిపోయింది. ఇది వైసీపీ నేతల కుట్రేనని కమ్యూనిటీని అడ్డుపెట్టుకుని తనపైకి శ్రీరెడ్డిని ఉసిగొల్పారంటూ రఘురామ ఆరోపించారు. ఇదిలా కొనసాగుతుండగానే నిన్న తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌ గచ్చిబౌలి బౌల్డర్‌హిల్స్‌లోని తన నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితులతో మాట్లాడుతుండగా... మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో 30 నుంచి 35 మంది సీఐడీ పోలీసులు అక్కడికి వచ్చారు. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించి... వారిని కూడా తమ వెంటతీసుకొచ్చారు.

‘ఆంధ్రా పోలీస్‌... ఏపీ గవర్నమెంట్‌...’ అంటూ ఐడీ కార్డులు చూపిస్తూ రఘురామకృష్ణరాజును అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో హైడ్రామా చోటు చేసుకుంది. పోలీసులు రఘురామను అదుపులోకి తీసుకునేందుకు యత్నిస్తుంటే.. ఎంపీకి రక్షణగా ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్లు రఘురామకృకష్ణరాజు చుట్టూ వలయంలా నిలబడ్డారు. అరెస్టు వారెంటు చూపాలని కోరారు. అది లేకుండా రఘురామను అరెస్టు చేసేందుకు అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రఘురామ కుటుంబ సభ్యులు సైతం పోలీసులను అడ్డుకున్నారు. దీంతో సుమారు గంటసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఐడీ అధికారులు సీఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారులతో మాట్లాడారు. తమ ఉన్నతాధికారుల సూచనల మేరకు రఘురామ అరెస్టుకు జవాన్లు సహకరించారు. ఆ వెంటనే .. రఘురామను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రఘురామను అరెస్ట్ చేసిన పోలీసులు శుక్రవారం రాత్రికి ఆయనను గుంటూరుకు తీసుకొచ్చారు. ఆయనను మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచి... రిమాండ్‌కు తరలించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. కాగా రఘురామపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇతరులతో కలసి కుట్రలు చేయడం (ఐపీసీ సెక్షన్‌ 120 బీ), ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం (124ఏ), ఇతరుల మధ్య విద్వేషాలు కలిగించేలా మాట్లాడటం (153ఏ), వ్యక్తిగత దూషణలు (505) తదితర అభియోగాల కింద అరెస్టు చేస్తున్నట్లు నోటీసు ఇచ్చారు. అయితే... ఆ నోటీసును తీసుకునేందుకుగానీ సంతకం చేసేందుకుగానీ రఘురామతో పాటు భార్య రమాదేవి కూడా నోటీసు తీసుకునేందుకు నిరాకరించారని.. దీంతో ఇంటి గోడకు అంటించామని పోలీసులు దానిపై రాశారు. ఆయనపై మంగళగిరి సీఐడీ పోలీసులు కేసు (12/2021) నమోదు చేసినట్లు నోటీసులో ఉంది.

More News

పెను ప్రమాదం నుంచి కోవిడ్ రోగులను రక్షించిన సోనూసూద్ బృందం

కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రముఖ నటుడు సోనూసూద్‌ మరింత మందికి సాయం అందిస్తున్నారు.

ప్రముఖ రచయిత-దర్శకుడు నంద్యాల రవి ఇక లేరు..

‘నేనూ సీతామహాలక్ష్మీ, పందెం, అసాధ్యుడు’ వంటి చిత్రాలతో రచయితగా తన సత్తా చాటుకుని... ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ చిత్రంతో దర్శకుడిగా మారిన నంద్యాల రవి(42) శుక్రవారం

గుండె పగిలే వార్త ఇది.. ధీర యువతి ఇకలేరు!

కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారతదేశం అల్లకల్లోలంగా మారుతోంది. ఎంతో మంది రోగులు ఆసుపత్రిల్లో బెడ్స్‌పై బతుకుతామనే ఆశను ఊపిరిగా చేసుకుని గడుపుతున్నారు.

తెలంగాణ పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్

తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లో పోలీసులు అంబులెన్స్‌లను నిలిపివేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది.

‘లూసిఫర్’ అప్‌డేట్.. ఆయన తప్పుకోలేదట

కరోనా మహమ్మారి కారణంగా ఇటీవలి కాలంలో కొద్ది రోజులుగా మూవీ అప్‌డేట్స్ ఏవీ లేకుండా పోయాయి.