జూన్ 1న అంధగాడు ప్రీమియర్ షోలు
Monday, May 29, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన `అంధగాడు` ప్రీమియర్ షోలు జూన్ 1న ప్రదర్శితం కానున్నాయి. జూన్ 2న ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించిన రాజారవీంద్ర ఈ ప్రీమియర్ షోలకు సంబంధించిన విషయాన్ని వెల్లడించారు. సినిమా మీద నమ్మకంతో వీటిని ప్రదర్శించనున్నట్టు చెప్పారు. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రమిది. ఏ టీవీ సమర్పిస్తోంది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.
రాజ్‌తరుణ్, హెబ్బాపటేల్, రాజేంద్రప్రసాద్, ఆశిష్ విద్యార్థి, రాజా రవీంద్ర, షాయాజీ షిండే, సత్య, పరుచూరి వెంకటేశ్వర రావు తదితరులు తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః బి.రాజశేఖర్, సంగీతంః శేఖర్ చంద్ర, ఆర్ట్ః కృష్ణ మాయ, చీఫ్ కోడైరెక్టర్ః సాయి దాసం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః కిషోర్ గరికపాటి, సహ నిర్మాతః అజయ్ సుంకర, నిర్మాతః రామబ్రహ్మం సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు,దర్శకత్వంః వెలిగొండ శ్రీనివాస్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments