జూన్ 1న అంధగాడు ప్రీమియర్ షోలు

  • IndiaGlitz, [Monday,May 29 2017]

రాజ్‌త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ జంట‌గా న‌టించిన 'అంధ‌గాడు' ప్రీమియ‌ర్ షోలు జూన్ 1న ప్ర‌ద‌ర్శితం కానున్నాయి. జూన్ 2న ఈ సినిమా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఆదివారం రాత్రి జ‌రిగిన ప్రీ రిలీజ్ వేడుక‌లో ఈ చిత్రంలో విల‌న్ పాత్ర‌లో న‌టించిన రాజార‌వీంద్ర ఈ ప్రీమియ‌ర్ షోలకు సంబంధించిన విష‌యాన్ని వెల్ల‌డించారు. సినిమా మీద న‌మ్మ‌కంతో వీటిని ప్ర‌ద‌ర్శించ‌నున్నట్టు చెప్పారు. వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్ర‌మిది. ఏ టీవీ స‌మ‌ర్పిస్తోంది. రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు.
రాజ్‌త‌రుణ్‌, హెబ్బాప‌టేల్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఆశిష్ విద్యార్థి, రాజా ర‌వీంద్ర‌, షాయాజీ షిండే, స‌త్య‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర రావు త‌దిత‌రులు తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః బి.రాజ‌శేఖ‌ర్‌, సంగీతంః శేఖ‌ర్ చంద్ర‌, ఆర్ట్ః కృష్ణ మాయ‌, చీఫ్ కోడైరెక్ట‌ర్ః సాయి దాసం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కిషోర్ గ‌రిక‌పాటి, స‌హ నిర్మాతః అజ‌య్ సుంక‌ర‌, నిర్మాతః రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు,దర్శ‌క‌త్వంః వెలిగొండ శ్రీనివాస్‌

More News

రీ రికార్డింగ్ లో 'ఉంగరాల రాంబాబు' జూన్ లో విడుదల

'జక్కన్న'తొ కమర్షియల్ సక్సస్ ని తన సొంతం చేసుకొన్న సునీల్ హీరోగా....

'రా రా' టీజర్ ను విడుదల చేసిన మోహన్ లాల్

శ్రీమిత్ర చౌదరి సమర్పణలో ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ హీరో గా,నాజియా నాయికగా నటిస్తున్న చిత్రమిది.

మెగా హీరోయిన్ తో నారా రోహిత్...

తొలి సినిమానుండి విలక్షణమైన సినిమాలు చేస్తున్న నారా రోహిత్ ఇప్పుడు శమంతక మణి అనే మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు.

భారీ ధరకు మహేష్ 'స్పైడర్ ' నైజాం హక్కులు...

బాహుబలి-2 సినిమా రిలీజ్ తర్వాత మేనియా తగ్గింది.

పదిరోజులకి 18 కొట్లు వసూలు చేసిన 'కేశవ'

నిఖిల్ నటించిన కేశవ చిత్రం మే 19న విడుదలయ్యి మంచి టాక్ తో సూపర్బ్ కలెక్షన్లతో దూసుకుపోతుంది.