మా 'అంధగాడు' చిత్రం దర్శకరత్న డా.దాసరిగారికి అంకితం - ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్

  • IndiaGlitz, [Wednesday,May 31 2017]

ప్ర‌పంచంలో ఏ ద‌ర్శ‌కుడు తీయ‌లేన‌ని విభిన్న‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించి 151 చిత్రాల‌కు ద‌ర్శ‌కుడిగా త‌న పేరును సువ‌ర్ణాక్ష‌రాల‌తో గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డులో రాసుకున్న ద‌ర్శ‌కర‌త్న డా.దాస‌రినారాయ‌ణరావుగారు ప‌ర‌మ‌ప‌దించ‌డం మ‌మ్మ‌ల్ని ఎంతో బాధ‌కు గురి చేసింది. ఇండ‌స్ట్రీకి సంబంధించి ఏ స‌మ‌స్య వ‌చ్చినా నేనున్నా అంటూ ముందుకు వ‌చ్చి నిల‌బ‌డి న్యాయం చేకూర్చే గొప్ప వ్య‌క్తి దాస‌రిగారు. మంచి చిత్రాల‌కు ఆద‌ర‌ణ ఉండాల‌ని, చిన్న నిర్మాత‌లు బావుండాల‌ని కోరుకునే శ్రేయోభిలాషి ఆయ‌న‌.
మా ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌కు వెన్నంటి నిలిచారు. ఎంట‌ర్‌టైన్మెంట్‌ను ఇష్ట‌ప‌డే దాస‌రిగారు మా సంస్థ‌లో వ‌చ్చిన ప్ర‌తి సినిమాను ఆయ‌న వీక్షించి యూనిట్‌కు త‌న ఆశీస్సుల‌ను అంద‌చేసేవారు. . భౌతికంగా దాస‌రిగారు మ‌న‌ల్ని విడిచి పెట్టినా, ఆయ‌న సినిమాల రూపంలో ఎప్ప‌టికీ మ‌న మ‌ధ్య‌నే ఉంటారు. మా సంస్థ‌కు దాస‌రిగారు అందించిన అందించిన స‌హాయ స‌హ‌కారాల‌ను మ‌ర‌చిపోలేం. మా బ్యాన‌ర్‌లో విడుద‌ల‌వుతున్న 'అంధ‌గాడు' చిత్రాన్ని దాస‌రిగారికి అంకిత‌మిస్తున్నాం. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ఆ భ‌గ‌వంతుని ప్రార్థిస్తున్నాం. - ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్