ఇటలీలో 'అంధగాడు'

  • IndiaGlitz, [Friday,March 31 2017]

ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ హీరోగా ఈడోర‌కం-ఆడోర‌కం, కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త వంటి సూప‌ర్‌హిట్ చిత్రాలు త‌ర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ 'అంధ‌గాడు'. కుమారి 21 ఎఫ్‌, ఈడోరకం-ఆడోర‌కం వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న రాజ్‌త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ జంట‌గా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈచిత్రాన్ని రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో. న‌ట‌కిరిటీ డా.రాజేంద్ర‌ప్రసాద్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ప్రారంభ‌మైన ఈ చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ప్ర‌స్తుతం టాకీ పార్ట్ పూర్త‌య్యింది. ఇటీలీలో పాట‌ల‌ను చిత్రీక‌రిస్తున్నారు.
హీరో రాజ్‌త‌రుణ్‌తో మా బ్యాన‌ర్ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌లో ఈడోర‌కం-ఆడోర‌కం, కిట్టుఉన్నాడు జాగ్ర‌త్త సూప‌ర్‌హిట్ చిత్రాలు రూపొందాయి. ఇప్పుడు అదే కోవలో మ‌రోసారి రాజ్‌త‌రుణ్ క‌థానాయ‌కుడుగా వెలిగొండ శ్రీనివాస్‌గారి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ 'అంధ‌గాడు'. డిఫ‌రెంట్ ,స్ట్రాంగ్ అండ్ ఎగ్జ‌యిట్‌మెంట్ పాయింట్‌తో సినిమా అంతా ర‌న్ అవుతుంది.అలాగే కుమారి 21ఎఫ్‌, ఈడోర‌కం-ఆడోర‌కం చిత్రాల హిట్ పెయిర్ రాజ్‌త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ జోడి న‌టిస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. అలాగే రైట‌ర్ వెలిగొండ శ్రీనివాస్‌గారు ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌య‌మ‌వుతున్న సినిమా కూడా అంధ‌గాడు కావ‌డం విశేషం. ప్ర‌స్తుతం సినిమాలోని రెండు పాట‌ల‌ను ఇట‌లీలో ఎవ‌రూ చిత్రీక‌రించ‌ని లోకేష‌న్స్‌లో ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ రాజ సుంద‌రంనేతృత్వంలో చిత్రీక‌రిస్తున్నాం. ఏప్రిల్ 5 వ‌ర‌కు ఇటలీలో పాట‌ల చిత్రీక‌ర‌ణ ఉంటుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మే 26న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని నిర్మాత రామ‌బ్ర‌హ్మం సుంకర తెలియ‌జేశారు.
రాజ్‌త‌రుణ్‌, హెబ్బాప‌టేల్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఆశిష్ విద్యార్థి, రాజా ర‌వీంద్ర‌, షాయాజీ షిండే, స‌త్య‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర రావు త‌దిత‌రులు తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః బి.రాజ‌శేఖ‌ర్‌, సంగీతంః శేఖ‌ర్ చంద్ర‌, ఆర్ట్ః కృష్ణ మాయ‌, చీఫ్ కోడైరెక్ట‌ర్ః సాయి దాసం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కిషోర్ గ‌రికిపాటి, స‌హ నిర్మాతః అజ‌య్ సుంక‌ర‌, నిర్మాతః రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు,దర్శ‌క‌త్వంః వెలిగొండ శ్రీనివాస్‌.